TPCC Chief రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే Danam Nagender ఫైర్, చివరిశ్వాస వరకు కేసీఆర్‌తోనని స్పష్టం

TPCC Chief Revanth Reddy: తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రంలో జ‌రుగుతున్న అభివృద్ధి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ లోని కొందరు నేతలకు కనిపించడం లేదా అని ఎమ్మెల్యే దానం ప్రశ్నించారు. కొత్త బిచ్చగాడు పొద్దెరగనట్లు కాంగ్రెస్, బీజేపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 2, 2021, 02:27 PM IST
  • చివరిశ్వాస వరకు తెలంగాణ సీఎం కేసీఆర్, కేటీఆర్‌తోనే ఉంటాను
  • రేవంత్ రెడ్డి మాటలకు మూతి, తోక లాంటివి ఏవీ ఉండవని విమర్శలు
  • ప్రతిపక్ష నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ దానం నాగేందర్ ఫైర్
TPCC Chief రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే Danam Nagender ఫైర్, చివరిశ్వాస వరకు కేసీఆర్‌తోనని స్పష్టం

TPCC Chief Revanth Reddy: తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాటలకు మూతి, తోక లాంటివి ఏవీ ఉండవని టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రంలో జ‌రుగుతున్న అభివృద్ధి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ లోని కొందరు నేతలకు కనిపించడం లేదా అని ఎమ్మెల్యే దానం ప్రశ్నించారు. కొత్త బిచ్చగాడు పొద్దెరగనట్లు కాంగ్రెస్, బీజేపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 

చివరిశ్వాస వరకు తెలంగాణ (Telangana) సీఎం కేసీఆర్, కేటీఆర్‌తోనే ఉంటానని టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కొందరు నేతలు తనపై ఉద్దేశపూర్వకంగానే ప్రచారం చేస్తున్నారని, ఆ దుష్ప్రచారానికి సంబంధించి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. క్రిమినల్ కేసులు పెట్టాలని పోలీసులను కోరినట్లు చెప్పారు. ఏళ్ల తరబడి కోట్లాడి సాధించుకున్న తెలంగాణను గుంజుకోవడానికి ఎవడబ్బ సొమ్ము కాదని ఘాటుగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సీనియ‌ర్లు ఆ పార్టీని వీడి టీఆర్ఎస్‌లో చేరాల‌ని దానం పిలుపునిచ్చారు. టీఆర్ఎస్‌లో చేరి తెలంగాణ అభివృద్ధిలో భాగ‌స్వాములు కావాల‌న్నారు.  

Also Read; Telangana Zones 2021: తెలంగాణలో అమల్లోకి కొత్త జోన్లు, మొత్తం 33 జిల్లాలతో 7 జోన్లు, ఉత్తర్వులు జారీ

టీపీసీసీ నూతన చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy)పై అధికార పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ నిప్పులుచెరిగారు. రేవంత్ రెడ్డి మాటలకు తల, తోక, మూతి ఉండదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక హైదరాబాద్ నగరానికి తాగునీటి సమస్య తీర్చిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తుంటే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం నోటికొచ్చినట్లు మాట్లాడటం తగదని హితవు పలికారు. గతంలో వైఎఎస్సార్ చివరి శ్వాస వరకు ఆయనతోనే ఉన్నానని, ఇప్పుడు తన చివరిశ్వాస వరకు తెలంగాణ సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌తో కొనసాగుతానన్నారు.

Also Read: TS EAMCET 2021: తెలంగాణ ఎంసెట్ 2021 Online Applications గడువు మరోసారి పొడిగింపు

ఎవరైనా తన ఇంటికి రావాలంటే కచ్చితంగా గులాబీ కండువాతోనే రావాలన్నారు. అలా వచ్చిన నేతలకు మాత్రమే తన ఇంట్లోకి ఆహ్వానం ఉంటుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో పూర్తి స్థాయిలో అభివృద్ధి జరుగుతున్నందున, భవిష్యత్తులో రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలకు పుట్టగతులు ఉండవని ఘాటుగా వ్యాఖ్యానించారు. తాను మాత్రం టీఆర్ఎస్‌లోనే కొనసాగుతూ రాష్ట్ర అభివృద్ధిలో తన వంతు పాటుపడతానని ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News