TSPSC Group1 Applications Date Extended Till March 16: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగ విద్యార్థులకు మేలుజరిగే దిశగా మరో కీలకనిర్ణయం తీసుకుంది. గ్రూప్ 1 దరఖాస్తు గడువు మర్చి 16 వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు కేవలం 2.70 లక్షల దరఖాస్తులే రావడంతో గ్రూప్ 1 దరఖాస్తు పొడిగించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. గత సంవత్సరం భారీ సంఖ్యలో 3.80 లక్షల దరఖాస్తులు రాగా, ఈ సంవత్సరం 5.50 లక్షల దరఖాస్తులు రావొచ్చని టీఎస్పీఎస్సీ అంచనా వేసింది. కానీ అనూహ్యంగా అప్లికేషన్ ల సంఖ్య తక్కువగా రావడంతో, యువతకు లాభం చేకూర్చే విధంగా అప్లికేషన్ తేదీని మార్చి 16 వరకు పెంచినట్లు సమాచారం.
Read More: Election Commission: కేంద్ర ఎన్నికల సంఘం కొత్త కమిషనర్లుగా సుఖ్‌బీర్ సంధు, జ్ఞానేష్ కుమార్ లు..
ఇప్పటికే గ్రూప్-1 పరీక్షల వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచుతు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. గతప్రభుత్వం.. 503 గ్రూప్ -1 పోస్టులకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి.. దానికి మరో 60 పోస్టులు జతచేసి మొత్తంగా 563 పోస్టులకు గాను తాజాగా, టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. నిరుద్యోగులు ఎన్నో ఏళ్లుగా గ్రూప్-1 సర్వీసులను సాధించడమే టార్గెట్ గా ప్రిపరేషన్ సాగిస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా, అప్లికేషన్ ల తేదీలను మరోసారి టీఎస్సీపీఎస్పీ పొడిగిస్తూ నిర్ణయం తీసుకొవడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తనదైన స్టైల్ లో పాలన అందిస్తుంది. టీఎస్పీఎస్సీని సమూలంగా ప్రక్షాళన చేసింది.
Read More: Viral Video: పోలీస్ స్టేషన్ ముందు నగ్నంగా నిలబడి హంగామా..
కొత్తగా టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ పోలీసు బాస్ మహేందర్ రెడ్డిని నియమిచింది. అదే విధంగా.. గతంలో అనేక పర్యాయాలు ఎగ్జామ్ లు పేపర్ లీకేజీలు, సరిగ్గా నిర్వహణ లేకపోవడం వల్ల పలుమార్లు ఎగ్జామ్ లు క్యాన్షిల్ అయిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఎగ్జామ్ కు అన్ని రకాలుగా పకట్భంది చర్యలు తీసుకొవాలని సీఎం రేవంత్ టీఎస్పీఎస్సీని ఆదేశించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
TSPSC: గ్రూప్ 1 అభ్యర్థులకు మరో గుడ్ న్యూస్.. అప్లికేషన్ తేదీలను పొడిగిస్తూ నిర్ణయం..
నిరుద్యోగులకు మరో తీపికబురు..
గ్రూప్ 1 అప్లికేషన్ లకు ఇంకా చాన్స్..