Telangana Corona cases: దిగొస్తున్న కొవిడ్​ కేసులు- కొత్తగా ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే..

Telangana Corona cases: తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా దిగొస్తున్నాయి. కొత్తగా 1,500 లోపే కేసులు నమోదయ్యాయి. కొవిడ్ కారణంగా తాజాగా ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 6, 2022, 09:10 PM IST
  • రాష్ట్రంలో భారీగా తగ్గిన కొవిడ్ కేసులు
  • రికవరీల్లో భారీ వృద్ధి నమోదు
  • జీహెచ్​ఎంసీ, రంగా రెడ్డి జిల్లాలో అత్యధిక కేసులు
Telangana Corona cases: దిగొస్తున్న కొవిడ్​ కేసులు- కొత్తగా ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే..

Telangana Corona cases: తెలంగాణలో కరోనా కేసులు మరింత తగ్గాయి. ఒక్క రోజులో 1,217 మందికి కొవిడ్ పాజిటివ్​గా తేలింది. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో 7,77,530 కేసులు నమోదయ్యాయి.

కొత్త కేసులు శనివారం సాయంత్రం 5.30 నుంచి ఆదివారం సాయంత్రం 5.30 వరకు చేసిన టెస్టుల ఆధారంగా నమోదైనవని తెలంగాణ ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ సమయంలో మొత్తం 48,434 మందికి కొవిడ్​ టెస్టులు చేసినట్లు వివరించింది.

రికవరీలు ఇలా..

రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గడంతో పాటు.. రికవరీలు కూడా భారీగా పెరుగుతుండటం గమనార్హం. తాజాగా 3,944 మంది కరోనాను జయించారు. తెలంగాణ వ్యాప్తపంగా ఇప్పటి వరకు 7,46,932 మంది కొవిడ్​ నుంచి సురక్షితంగా బయటపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం రికవరీ రేటు 96.06 శాతానికి పెరిగింది.

రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 26,498 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మరణాలు ఇలా..

కరోనాతో రాష్ట్రంలో తాజాగా ఒకరు మృతి చెందారు. దీనితో ఇప్పటి వరకు రాష్ట్రంలో కొవిడ్ మృతుల సంఖ్య 4,100 వద్దకు చేరింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.53 శాతంగా ఉన్నట్లు ఆరోగ్య శాఖ డేటాలో వెల్లడైంది.

జిల్లాల వారీగా ఇలా..

అదిలాబాద్​- 28
భద్రాద్రి కొత్తగూడెం- 13
జీహెచ్​ఎంసీ-383
జగిత్యాల- 18
జనగామ- 16
జయశంకర్​ భూపాలపల్లి- 1
జోగులాంబ గద్వాల- 3
కామారెడ్డి- 5
కరీంనగర్​-36
ఖమ్మం-57
కొమురం భీమ్​ ఆసిఫాబాద్​-2
మహబూబ్​నగర్​- 62
మహబూబాబాద్​- 32
మంచిర్యాల- 17
మెదక్- 8
మేడ్చల్ మల్కాజ్​గిరి- 99
ములుగు- 2
నాగర్​కర్నూల్​- 14
నల్గొండ- 54
నారయణపేట్​- 7
నిర్మల్​- 5
నిజామాబాద్​- 24
పెద్దపల్లి- 6
రాజన్న సిరిసిల్ల- 8
రంగారెడ్డి- 103
సంగారెడ్డి- 38
సిద్దిపేట్​- 45
సూర్యాపెట్​- 41
వికారాబాద్​- 14
వనపర్తి- 12
వరంగల్​ రూరల్​- 7
హనుమకొండ- 48
యాదాద్రి భువనగిరి- 9

Also read: Statue of Equaluity: సమతా మూర్తి విగ్రహం వద్ద ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు

Also read: Statue of Equality: సమతా మూర్తి విగ్రహాన్ని జాతికి అంకితం ఇచ్చిన ప్రధాని మోదీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News