తెలంగాణ మంత్రికి టిఎస్ఆర్టీసి సమ్మె సెగ

భద్రాచలంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ని అడ్డుకున్న టిఎస్ఆర్టీసీ కార్మికులు

Last Updated : Nov 13, 2019, 01:47 PM IST
తెలంగాణ మంత్రికి టిఎస్ఆర్టీసి సమ్మె సెగ

భద్రాద్రి-కొత్తగూడెం: జిల్లాలో నేడు పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌కి టిఎస్ఆర్టీసీ సమ్మె సెగ తగిలింది. బ్రిడ్జి సెంటర్ వద్ద మంత్రిని అడ్డుకున్న ఆర్టీసీ కార్మికులు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కార్మికులను అదుపులోకి తీసుకుని మంత్రిని అక్కడి నుంచి పంపించేశారు. 

అనంతరం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని సందర్శించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్‌కి దేవాలయ అధికారులు, పూజారులు స్వాగతం పలికి స్వామివారి సన్నిధిలో శాలువా కప్పి సత్కరించారు. 

స్వామి వారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి సత్యవతి రాథోడ్.. భద్రాద్రి ఆలయంతో తనకు చిన్నప్పటి నుంచే అనుబంధం ఉందని.. చిన్న వయసులోనే టెంపుల్ ట్రస్ట్ బోర్డ్ సభ్యురాలిగా ఉన్నానని గుర్తుచేశారు. ఇప్పుడు మంత్రి హోదాలో ఈ ప్రాంతానికి సేవ చేసే అవకాశం దక్కిందని మంత్రి సత్యవతి రాథోడ్ ఆనందం వ్యక్తంచేశారు.

Trending News