Harish Rao: బీజేపీ మాటలు వింటే ఆగం..కాంగ్రెస్‌ను నమ్మితే మోసం..హరీష్‌రావు ధ్వజం..!

Harish Rao: తెలంగాణలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు మంత్రి హరీష్‌రావు కౌంటర్ ఇచ్చారు. 

Written by - Alla Swamy | Last Updated : Jul 22, 2022, 06:36 PM IST
  • తెలంగాణలో పొలిటికల్ హీట్
  • అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం
  • తాజాగా మంత్రి హరీష్‌రావు కౌంటర్
Harish Rao: బీజేపీ మాటలు వింటే ఆగం..కాంగ్రెస్‌ను నమ్మితే మోసం..హరీష్‌రావు ధ్వజం..!

Harish Rao: బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలపై మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. బీజేపీ మాటలు వింటే ఆగం..కాంగ్రెస్‌ మాటలు వింటే మోసమని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కళ్యాణ లక్ష్మీ, రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు వంటి పథకాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు ఎన్నో మాటలు చెబుతున్నారని..60 ఏళ్ల పాలించి ఏం చేశారని ఫైర్ అయ్యారు. 

అందుకే అభివృద్ధి చేసే పార్టీలకే నమ్మలని ప్రజలకు పిలుపునిచ్చారు. నారాయణ్‌ఖేడ్‌లో టీఆర్ఎస్ నేతల సమావేశంలో మంత్రి హరీష్‌రావు ప్రసంగించారు. ఈసందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. నారాయణ ఖేడ్ రూపు రేఖలను పూర్తిగా మార్చామన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో రూ.వంద కోట్ల పనులు జరుగుతున్నాయని చెప్పారు. రూ.25 కోట్లతో రోడ్లను ఆధునీకరిస్తున్నామని తెలిపారు. 

800 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను దసరాలోపు పూర్తి చేసి..అర్హులైన వారికి అందిస్తామన్నారు. మంచి విద్య, వైద్యం అందిస్తున్నామని స్పష్టం చేశారు. త్వరలో మరో 50 పడకల ఆస్పత్రిని తీసుకొస్తామన్నారు. తల్లి,బిడ్డలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామన్నారు మంత్రి హరీష్‌రావు. టీఆర్ఎస్‌ నేతల సమావేశంలో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Also read:Jamili Elections: దేశంలో జమిలి ఎన్నికలు రాబోతున్నాయా..కేంద్ర ప్రభుత్వ వాదన ఏంటి..!

Also read:Video Viral: కదులుతున్న రైలులో మంటలు..ప్రయాణికుల పరుగులు..వీడియో వైరల్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News