హైదరాబాద్: ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. దాదాపు రెండున్నర గంటలపాటు కొనసాగిన ఈ సమావేశంలో తెలంగాణ బడ్జెట్ 2019-20కు మంత్రులు ఆమోదం తెలిపారు. సోమవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అంతకన్నా ఒక రోజు ముందుగా కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. రాష్ట్ర బడ్జెట్‌ని కేబినెట్ మంత్రులకు వివరించారు. అనంతరం కేబినెట్ సభ్యులు బడ్జెట్‌ను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా నియమితులైన మంత్రులకు సభలో వ్యవహరించాల్సిన తీరుపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టుగానూ తెలుస్తోంది.
సోమవారం ఉ. 11.30కి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా సీఎం కేసీఆర్ అసెంబ్లీలో, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు శాసనమండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.