Telangana MLAs: తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు హాట్ హాట్‌గా మారుతున్నాయి. ఒక పార్టీలో ఎమ్మెల్యేలుగా గెలిచిన నేతలు అధికార పార్టీలో చేరడంతో రాజకీయాలు హాట్‌గా కొనసాగుతున్నాయి. తెలంగాణ పొలిటికల్ సర్కిల్ ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకోండి.
Telangana Politics: రాజకీయాల్లో ఆయనో సీనియర్ ఎమ్మెల్యే అంతే కాదు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా చేసిన అనుభవం. అయితే ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఒక హవా కొనసాగించి ఆయన తెలంగాణ వచ్చాక మాత్రం సైలైంట్ గా ఉండి పోయారు. కానీ మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీరే మారింది. తనలో ఉన్న పాత క్యారెక్టర్ ను మళ్లీ పరిచయం చేస్తున్నాడని పొలిటికల్ సర్కిల్ లో జోరుగా చర్చ కొనసాగుతుంది. ఇంతకీ ఎవరా లీడర్ ..? ఏంటా ఆయన పాత క్యారెక్టర్ ..
MLA Danam Nagender Comments in Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి పరుషపదజాలం ఉపయోగించారు. ఒక్కొక్కడిని బయట తిరనివ్వనంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దానం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫైర్ అయ్యారు.
Telangana Assembly Sessions Updates: గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై చేసిన అప్పులపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కేసీఆర్ సిగ్గు కాపాడాలా..? తెలంగాణను కాపాడాలా..? అని అన్నారు. ప్రజలకు వాస్తవాలను వివరిస్తున్నామని చెప్పారు.
Telangana Assembly: కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం పదకొండున్నరకు కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే సాయన్నతో పాటు ఇటీవలి కాలంలో మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం పాటిస్తారు.
KTR Assembly Speech: హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కంటోన్మెంట్ పరిధిలోని అంశాలపై కంటోన్మెంట్ బోర్డు తీసుకుంటున్న కఠిన నిర్ణయాల గురించి మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. కంటోన్మెంట్ బోర్డు అధికారులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
Telangana Cabinet Meeting: రేపు ప్రవేశ పెట్టబోయే రాష్ట్ర బడ్జెట్‌కు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సాయంత్రం కేబినెట్ భేటీ జరిగింది.
Telangana Minister KTR | కేంద్రం ప్రకటించిన ప్యాకేజీతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదని, రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ఏమైందో ఎవరికీ తెలియదన్నారు. తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో టీఎస్ ఐపాస్ విధానంలో పరిశ్రమలపై అడిగిన ప్రశ్నలకు తెలంగాణ మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు.
అనుకున్నట్లుగానే తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదాపడ్డాయి. ఎమ్మెల్యే సహా పలువురు అసెంబ్లీ సిబ్బందికి, జర్నలిస్టులకు, పోలీసులకు కరోనా సోకిన నేపథ్యంలో సభ నిరవధిక వాయిదా (Telangana Assembly Adjourned Sine die) వేశారు.
తెలంగాణ వీఆర్ఏ (VRA In Telangana)లకు సీఎం కేసీఆర్ తీపికబురు అందించారు. ప్రస్తుతం పనిచేస్తున్న వీఆర్ఏలు ఉద్యోగం తీసుకోవచ్చునని, లేకపోతే వారి కుటుంబంలోని వారసులకు అయినా ఉద్యోగం ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
భారతరత్న, మాజీ రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీని స్మరించుకుంటూ తెలంగాణ శాసనసభ సమావేశాలలో భాగంగా నేడు సభలో ఆయనకు సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల రాష్ర్ట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సభలో సంతాప తీర్మానాన్ని ( Tribute to Pranab Mukherjee ) ప్రవేశపెట్టారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.