Telangana Investment: తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. తరలివస్తున్న దిగ్గజ సంస్థలు

Invest Telangana: అధికారం మారినా తెలంగాణలో పెట్టుబడుల ప్రవాహం మాత్రం ఆగడం లేదు. తెలంగాణకు పరిశ్రమలు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. దావోస్‌ సదస్సు వేదికగా కొన్ని వేల కోట్ల పెట్టుబడులతో ప్రముఖ కంపెనీలు ముందుకురాగా.. తాజాగా మరో కంపెనీ తెలంగాణకు చేరుకుంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 19, 2024, 11:16 PM IST
Telangana Investment: తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. తరలివస్తున్న దిగ్గజ సంస్థలు

Telangana Investment In PV Industry: గత బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వం మాదిరి తెలంగాణలోని కొత్త ప్రభుత్వం కూడా పారిశ్రామిక ప్రగతికి అడుగులు వేస్తోంది. ఐటీతోపాటు ఇతర పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తుండడంతో తెలంగాణకు భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. తాజాగా మరో కంపెనీ తెలంగాణ కేంద్రంగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువచ్చింది. రూ.6 వేల కోట్లు పెట్టుబడులు పెడతామని అంతర్జాతీయ స్థాయి కంపెనీ ప్రకటించింది.

Also Read: Dengue Fever: మంత్రికి సోకిన డెంగీ వ్యాధి.. మేడారం జాతర ఎలా జరుగునోనని ఆందోళన..

సోలార్‌ పీవీ మాడ్యూల్‌, పీవీ సెల్స్‌ తయారీ యూనిట్లను నెలకొల్పుతామని దిగ్గజ సంస్థ రెన్యూ సిస్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ ప్రకటించింది. దీనికి గాను రూ.6 వేల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టి పరిశ్రమను నెలకొల్పుతామని ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్‌లో సోమవారం పెట్టుబడుల ఒప్పందాలు మంత్రి శ్రీధర్‌ బాబు సమక్షంలో జరిగాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఫ్యాబ్‌ సిటీలో ఆ శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌తో కంపెనీ ప్రతినిధులు ఒప్పందాలు చేసుకున్నారు.

Also Read: Gruha Jyothi Scheme: ఉచిత విద్యుత్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన.. ఇవి చేస్తేనే పథకానికి అర్హులు

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ.. 'కర్ణాటక, మహారాష్ట్రలో రెన్యూ సిస్‌ సంస్థకు తయారీ యూనిట్లు ఉన్నప్పటికీ అదిపెద్ద తయారీ యూనిట్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పాలని నిర్ణయించుకోవడం సంతోషంగా ఉంది.పరిశ్రమ ఏర్పాటుకు కావాల్సిన అన్ని సహాయ సహకారం ప్రభుత్వం అందిస్తుంది' అని తెలిపారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో హైదరాబాద్‌ సోలార్‌ పరికరాల తయారీకి హబ్‌గా మారుతుందని ఆకాంక్షించారు. విద్యుత్‌ పరికరాల తయారీని ప్రోత్సహిస్తామని, ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తామని మంత్రి పేర్కొన్నారు. దీనికోసం ప్రత్యేకంగా సమగ్ర ఇంధన పాలసీని రూపొందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులకు ప్రభుత్వం తరఫున కానుకలు ఇచ్చారు. 

ఈ పరిశ్రమ ఏర్పాటుతో రానున్న ఐదేళ్లలో 11 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కాగా ఈ కార్యక్రమానికి ముందు టీఎస్‌ఐఐసీ ఏరోస్పేస్‌ పార్కులో అపోలో మైక్రోసిస్టమ్స్‌ సంస్థ ఏర్పాటుచేయనున్న వెపన్స్‌ సిస్టమ్‌ ఇంటిగ్రేషన్‌ యూనిట్‌ పనులకు భూమి పూజ చేశారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో మూడేళ్లలో దాదాపు 400 మందికి ఉపాధి కల్పిస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News