T Jeevan Reddy Upset: అధిష్టానం రంగంలోకి దిగిన బుజ్జగించినా కూడా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. స్థానిక నాయకుడైన తనకు చెప్పకుండా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చేర్పించుకోవడంతో అలక బూనిన జీవన్ రెడ్డికి సొంత పార్టీ నాయకుల నుంచే ఘోర అవమానం జరిగింది. జగిత్యాలలో జీవన్ రెడ్డికి సంబంధించిన ఫ్లెక్సీలు తొలగించడం కలకలం రేపింది.
Also Read: BRS Party MLAs: ఎంపీ కె కేశవరావు రాజీనామాతో 6 మంది ఎమ్మెల్యేలకు పదవీ గండం?
ఆషాఢ మాసం బోనాల సందర్భంగా జగిత్యాల పట్టణంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. జగిత్యాలలోని 8వ వార్డులో బేడ బుడగ జంగాల బోనాల సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫొటోతో ఉన్న ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫ్లెక్సీని ఇలా కట్టారో లేదో అలా మున్సిపల్ సిబ్బంది తొలగించారు. బోనాల కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తిరుగు ప్రయాణంలో ఫ్లెక్సీ తొలగించడాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: KCR Farmhouse: దిష్టిపోయింది.. ఇక అన్నీ మంచి శకునములే: మాజీ సీఎం కేసీఆర్
తన ఫ్లెక్సీలనే తీస్తారా? అని మున్సిపల్ సిబ్బందిపై మండిపడ్డారు. ఉదయం కట్టిన ఫ్లెక్సీని తొలగించాల్సిన అవసరం ఏముందంటూ మున్సిపల్ సిబ్బంది ప్రశ్నించారు. స్పందించిన మున్సిపల్ సిబ్బంది తమకు టీపీఎస్ తేజస్విని తొలగించాలని ఆదేశించడంతోనే తొలగించినట్లు బదులిచ్చారు. వెంటనే మున్సిపల్ ఉన్నత అధికారులతో మాట్లాడి ఫ్లెక్సీలను ఎలా తొలగిస్తారు అంటూ మండిపడ్డారు.
తన ఫ్లెక్సీల తొలగింపునకు కారణమైన టీపీఎస్ తేజస్వినిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని జీవన్ రెడ్డి తెలిపారు. అసలు తనను జగిత్యాల లో ఉండనిస్తారా వెళ్లగొడతారా అంటూ జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. అనంతరం అక్కడి నుంచి ఆయన అసహనంతో వెళ్లిపోయారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి జగిత్యాలలో జీవన్ రెడ్డికి గౌరవం తగ్గుతోందనే ప్రచారం జరుగుతోంది.
తగ్గుతున్న ప్రాధాన్యం
సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో సంజయ్ కుమార్‌కు ప్రాధాన్యం పెరుగుతోందని చర్చ జరుగుతోంది. అయితే సంజయ్ కుమార్ వర్గీయులే మున్సిపల్ అధికారులతో ఫ్లెక్సీలు తీయించారని ప్రచారం నడుస్తోంది. అధిష్టానం బుజ్జగించినా క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరే విధంగా ఉండడంతో జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. త్వరలోనే భారీ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter