MLC Kavitha: ఉద్యోగ కల్పనలో శ్రీలంకతో పోటీ.. మోడీ సర్కార్ ఫెయిల్ అన్న కవిత

MLC Kavitha: కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో దూకుడు కొనసాగిస్తున్నారు తెలంగాణ ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత. కొన్ని రోజులుగా అంశాల వారీగా మోడీ సర్కార్ తీరును ఆమె సోషల్ మీడియా వేదికగా ఎండగడుతున్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లు, గ్యాస్ సబ్సిడీ వంటి అంశాలపై తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు

Written by - Srisailam | Last Updated : May 31, 2022, 10:47 AM IST
  • మోడీ సర్కార్ పై ఎమ్మెల్సీ కవిత ఫైర్
  • ఉద్యోగ కల్పనలో శ్రీలంకతో పోటీ- కవిత
  • మోడీ సర్కార్ ఫెయిల్ అన్న కవిత
MLC Kavitha: ఉద్యోగ కల్పనలో శ్రీలంకతో పోటీ.. మోడీ సర్కార్ ఫెయిల్ అన్న కవిత

MLC Kavitha: కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో దూకుడు కొనసాగిస్తున్నారు తెలంగాణ ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత. కొన్ని రోజులుగా అంశాల వారీగా మోడీ సర్కార్ తీరును ఆమె సోషల్ మీడియా వేదికగా ఎండగడుతున్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లు, గ్యాస్ సబ్సిడీ వంటి అంశాలపై తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. లెక్కలతో సహా వివరిస్తూ బీజేపీది ఫెయిల్ ప్రభుత్వమని ఆరోపణలు చేస్తున్నారు కవిత. తాజాగా నిరుద్యోగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు కవిత. తీవ్రమైన ఆర్థిక, ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంచున్న శ్రీలంకతో పోల్చుతూ ఆమె మోడీ ప్రభుత్వాన్నిటార్గెట్ చేశారు.

మోడీ పాలనలో దేశంలో నిరుద్యోగిత రేటు పెరిగిపోయిందని ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. వివిధ దేశాల్లో అన్ ఎంప్లాయిమెంట్ ఎలా ఉందో వివరించే టేబుల్ ను ఆమె తన పోస్టుకు జత చేశారు.
భారతీయ యువతను మోడీ ప్రభుత్వం ఎలా విఫలం చేసిందో దేశ ప్రజలు అర్థం చేసుకోవాలంటూ ఆమె కామెంట్ చేశారు. మోడీ ఫెయిల్స్ యూత్ హ్యాట్ ట్యాగ్ తో కవిత ఈ పోస్టు పెట్టారు. వరల్డ్ బ్యాంక్ రిపోర్టుగా చెబుతున్న ఈ డేటాలో భారత్ లో నిరుద్యోగిత రేటు 24.9 శాతంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే మనం నాలుగో స్థానంలో ఉన్నాం. ఇది అత్యంత దారుణమని కవిత కామెంట్ చేశారు.

 

కవిత ఇచ్చిన డేటా ప్రకారం నిరుద్యోగంలో ఇరాన్, ఇస్లామిక్ రిపబ్లిక్ మొదటి స్థానంలో ఉన్నాయి. ఆ దేశాల్లో అన్ ఎంప్లాయిమెంట్ 28.5 శాతంగా ఉంది. 27.5శాతంతో ఇరాక్ రెండో స్థానంలో ఉండగా. 25.5 శాతంతో శ్రీలంక థర్డ్ ప్లేస్ లో నిలిచింది. లంకతో పోటీ పడుతున్న భారత్.. 24.9 శాతం నిరుద్యోగితతో నాలుగో స్థానంలో ఉంది. భారత్ తర్వాత టర్కీ, ఈజిప్టు దేశాలున్నాయి. భారత్ కంటే బంగ్లాదేశ్ లో ఉద్యోగ కల్పన బాగుంది. ఆ దేశంలో నిరుద్యోగిత రేటు 14.8 శాతంగా ఉంది.

అయితే కవిత ఇచ్చిన డేటా వరల్డ్ బ్యాంక్  లెక్కలు 2020 సంవత్సరానివి. దీన్ని ప్రశ్నిస్తూ కొందరు కవితకు కౌంటర్  కామెంట్లు పెట్టారు. 2020 కాదు తాజా లెక్కలు ఇవ్వాలని కొందరు కామెంట్ చేశారు. 2020 అంటే కొవిడ్ మహమ్మారి పీక్ దశో ఉన్న సమయమని.. ఆ కాలానికి సంబంధించిన డేటా తీస్తే అలా అని మరికొందరు నిలదీశారు. తెలంగాణ పరిస్థితి ఏంటని మరికొందరు కవితను ప్రశ్నించారు. తెలంగాణలో గత నాలుగేళ్లుగా ఉద్యోగాలే లేవని కొందరు నెటిజన్లు నిలదీశారు.

READ ALSO:Group-1 2022: గ్రూప్‌-1కు రికార్డు స్థాయిలో దరఖాస్తులు...నేటితో ముగియనున్న గడువు!

READ ALSO: BJP Rajya Sabha Candidates: రాజ్యసభకు బీసీ నేత డా.లక్ష్మణ్... వ్యూహాత్మకంగా వ్యవహరించిన కమలదళం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News