Komatireddy Venkat Reddy: సిద్ధిపేటలో మంత్రి హరీశ్ రావుకి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్

Komatireddy Venkat Reddy Press Meet: నాలుగు కోట్ల ప్రజల కోసం తెలంగాణ ఇస్తే, నాలుగు కుటుంబాలు మాత్రమే బాగుపడ్డాయి అని అన్నారు. బంగారు తెలంగాణ బతకలేని తెలంగాణగా మారింది అంటూ బీఆర్ఎస్ పాలనపై మండిపడ్డారు.

Written by - Pavan | Last Updated : Sep 9, 2023, 05:53 AM IST
Komatireddy Venkat Reddy: సిద్ధిపేటలో మంత్రి హరీశ్ రావుకి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్

Komatireddy Venkat Reddy Press Meet: కొంగర్ కలాన్ సభకు ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలి అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. కర్ణాటకలో మాదిరి తెలంగాణలో సోనియాగాంధీ ఐదు గ్యారెంటీ పథకాల ప్రకటన చేస్తారని చెప్పిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. నాలుగు కోట్ల ప్రజల కోసం తెలంగాణ ఇస్తే, నాలుగు కుటుంబాలు మాత్రమే బాగుపడ్డాయి అని అన్నారు. బంగారు తెలంగాణ బతకలేని తెలంగాణగా మారింది అంటూ బీఆర్ఎస్ పాలనపై మండిపడ్డారు. నేడు బిఆర్ఎస్ ఇస్తామంటున్న 4వేల పెన్షన్ కాంగ్రెస్ హయాంలో 400 రూపాయలతో సమానం అని అభిప్రాయపడ్డారు. సిద్ధిపేటలో మీడియాతో మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ పాలనను ఏకిపారేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల కోట్ల అప్పు చేసిందని మండిపడ్డారు. రవీందర్ హోంగార్డుది ఆత్మహత్య కాదు, ముమ్మాటికీ అది ప్రభుత్వం చేసిన హత్యే. హోమ్ గార్డు రవీందర్ కుటుంబానికి ప్రభుత్వం వెంటనే 25 లక్షలు ఎక్స్‌గ్రేషియ ప్రకటించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. అలాగే వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేసీఆర్ సర్కారుని డిమాండ్ చేశారు. హోంగార్డులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పిన కేసీఆర్ మాట తప్పారు. ప్రతి విషయంలో ఇచ్చిన మాట తప్పుతూ ప్రజలను మోసం చేస్తూ వస్తున్నారు. కేసిఆర్ డబ్బుల మీద ఆధారపడితే, మేము ప్రజల సంక్షేమం కోసం ఆలోచిస్తాం. కేసిఆర్ నీ ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేదు. పార్లమెంట్ సమవేశాల్లో జమిలి ఎన్నికలు అనే చర్చ వస్తుంది. ఎన్నికల సందర్భంగా బిసి బంధుతెచ్చి, బీఆర్ఎస్ నాయకులు తప్ప ఎవరికి ఇవ్వడం లేదు. కేసీఆర్ దుకాణం బంధు కావడానికి, అన్ని బందు లు పెట్టారు.

సోనియాగాంధీ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని కేసీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ పెట్టె మీటింగ్ బంధు పెట్టుకోవాలి. కేసిఆర్ డబ్బులను నమ్ముకొని రాజకీయాలు చేస్తున్నాడు. దళిత బందు, బిసి బంధు, ఇండ్లు బీఆర్ఎస్ నాయకులకు తప్ప, పేద ప్రజలకు ఇవ్వడం లేదు. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రభుత్వ పథకాలపై అసంతృప్తిగా ఉన్నాను. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి పదవి అనేది చాలా చిన్నది. మంత్రి పదవినే పక్కన పెట్టిన వ్యక్తిని నేను. అలాంటప్పుడు పదవుల కోసం ఎందుకు పాకులాడుతాను అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

సామాజిక సమీకరణాల దృష్ట్యా గెలుపు గుర్రాలకే టికెట్స్ ఇస్తాము. 65 శాతం ఉన్న బిసిలకు మూడు మంత్రి పదవులు ఇచ్చారు. రెడ్డిలకు 8 మంత్రి పదవులు ఇచ్చారు. ఈటలపై కోపంతో 12 శాతం మంది ఉన్న ముదిరాజులకు టికెట్ ఇవ్వలేదు. తాను పదవులను ఆశించే వ్యక్తిని కాదు.. అవసరం అయితే నా నల్లగొండ టికెట్ ఇతరులకు ఇవ్వమని చెప్తాను. తాను బతికేదే తెలంగాణ ప్రజల కోసం. కేసీఆర్ ఎన్ని మాయమాటలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టంచేశారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ కు అహంకారం పెరిగిపోయిందన్న ఎంపీ కోమటిరెడ్డి.. రాష్ట్రంలో దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి మోసం చేశావ్... కనీసం 50 లక్షల పైచిలుకు జనాభా ఉన్న మాదిగలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇయ్యలేదు అని మండిపడ్డారు. తెలంగాణలో ఎక్కడ కూడా కరెంట్ 24 గంటలు ఇస్తలేరు. లాగ్ బుక్‌లను నేను చెక్ చేసాక తెలంగాణ సమాజానికి ఈ విషయం బయటపెట్టాను. 10 సంవత్సరాలు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. అహంకారం తలకెక్కిన కేసీఆర్ ను గద్దె దించడం కోసం అవసరమైతే తన ఎమ్మెల్యే సీట్ ను వదులుకోవడానికైనా సిద్ధమే అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో తాను అసంతృప్తితో ఉన్నానని వస్తోన్న వార్తల్లో నిజం లేదు. తనకు ఎలాంటి అసంతృప్తి లేదు. అదంతా మీడియా సృష్టే అని కోమటిరెడ్డి స్పష్టంచేశారు. సీనియర్ నాయకులంతా కలిసి పని చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తాం. మంత్రి హరీశ్ రావును సవాల్ చేస్తున్న 15 గంటల కరెంట్ ఉన్నట్టు నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తా.. మీరు రాజీనామా చేయకున్నా ప్రజలకు క్షమాపణ చెప్పండి అంటూ ఎంపీ కోమటిరెడ్డి మంత్రి హరీశ్ రావుకి సవాల్ విసిరారు. 

Trending News