Suicide: భార్య వేధిస్తోందని భర్త ఆత్మహత్య.. చావక తప్పట్లేదంటూ సెల్ఫీ వీడియో

Suicide: భార్యతో గొడవలు, ఆమె వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని ఓ యువకుడు సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు. అనంతరం దాన్ని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. తన చావుకు భార్య, ఆమె కుటుంబ సభ్యులే కారణమని వీడియోలో పేర్కొన్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 15, 2021, 10:18 AM IST
  • హైదరాబాద్‌ షేక్‌పేటలో యువకుడి ఆత్మహత్య
    భార్య, ఆమె కుటుంబ సభ్యులు వేధిస్తున్నారంటూ సెల్ఫీ వీడియో
    వారికి శిక్ష పడేలా చూడాలని వీడియోలో కోరిన యువకుడు
Suicide: భార్య వేధిస్తోందని భర్త ఆత్మహత్య.. చావక తప్పట్లేదంటూ సెల్ఫీ వీడియో

Man commits suicide alleging harassment by wife: భార్య, అత్తింటివారు తనను వేధిస్తున్నారంటూ (Harassment) ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన చావుకు భార్య, అత్తమామలు, బావమరిది కారణమంటూ ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు. వారికి కచ్చితంగా శిక్ష పడేలా చూడాలని తన సోదరుడు అన్వేష్‌ను కోరాడు. అనంతరం పురుగుల మందు సేవించి ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని షేక్‌పేటలో ఈ ఘటన చోటు చేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం... షేక్‌పేటకు (Hyderabad) చెందిన సంతోష్ (37) ఎంబీఏ చదివి ఓ ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. 2013లో ఫలక్‌నుమాకు చెందిన ఓ యువతితో సంతోష్ వివాహం జరిగింది. పెళ్లయిన కొన్నేళ్లు వీరి కాపురం సాఫీగానే సాగింది. వీరికి ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. ఏమైందో తెలియదు కానీ కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.

ఇదే క్రమంలో సంతోష్ భార్య భరోసా సెంటర్‌ను (BHAROSA HYDERABAD POLICE) ఆశ్రయించి అతనిపై ఫిర్యాదు చేసింది. ఈ ఏడాది ఆగస్టు నుంచి కుమారుడితో కలిసి ఆమె పుట్టింట్లోనే ఉంటోంది. మరోవైపు సంతోష్ తన తల్లిదండ్రులతో కలిసి షేక్‌పేటలో ఉంటున్నాడు. గత శుక్రవారం( నవంబర్ 12) ఆత్మహత్యకు (Suicide) ముందు సెల్ఫీ వీడియోను రికార్డ్ చేశాడు. 'అమ్మా నన్ను క్షమించు.. ఎంతో జీవితం చూడాలనుకున్నా చావక తప్పట్లేదు. కొడుకుని ఉన్నత స్థితిలో ఉండేలా చదివిద్దామనుకున్నా.మంచి స్కూల్లో చేర్పించా.కానీ నా భార్య అవేం చేయనివ్వట్లేదు. ఎప్పుడూ ఏవో గొడవలు.. పుట్టింటి వాళ్లతో కలిసి నన్ను చంపాలని చూసింది. ఆమె కోసం మిమ్మల్ని కాదనుకున్నా... అక్కా క్షమించండి... అందరికీ గుడ్ బై..' అని సంతోష్ ఆ వీడియోలో పేర్కొన్నాడు. 

Also Read: Gavaskar On Vihari: ‘టెస్టు జట్టులో విహారిని ఎంపిక చేయకపోవడానికి కారణమదే’

తన చావుకు కారణమైనవారికి శిక్ష పడేలా చూడాలని అన్నయ్య అన్వేష్‌ను కోరాడు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. ఆపై కూల్ డ్రింక్‌లో పురుగుల మందు కలిపి తాగి ఆత్మహత్యకు (Suicide) పాల్పడ్డాడు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News