Formula one Race: ఫార్ములా ఈ-రేసు నిర్వహణ పేరుతో రూ. 54 కోట్లు రూపాయలు విదేశీ సంస్థకు చెల్లించారనే ఆరోపణలపై ఈడీ రంగంలోకి దిగింది. ఈ ప్రక్రియలో నిబంధనలు పాటించలేదని పురపాలక పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే కదా.విదేశీ సంస్థకు నిధులు చెల్లించినప్పటికీ ఆర్బీఐ అనుమతి తీసుకోకపోవడం ఫెమా ఉల్లంఘన కిందికే వస్తుందన్నారు. దాంతో పాటు నిధుల మళ్లింపు జరిగినట్లు కూడా అనుమానిస్తున్న ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు పీఎంఎల్‌ఏ చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. ఏసీబీ కేసుపై మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించగా పది రోజుల వరకూ అరెస్టు చేయవద్దని ఆదేశించిన సంగతి తెలిసిందే కదా.
2023 ఫిబ్రవరి 11న నిర్వహించిన రేసుతో పాటు.. 2024 ఫిబ్రవరి 10న నిర్వహించాలనుకన్న మరో రేసుకు సంబంధించి ఫార్ములా ఈ ఆపరేషన్స్‌తో పురపాలకశాఖ నిర్వహించిన ప్రశ్నా జవాబులతో కూడిన వివరాలను కూడా సేకరించే పనిలో పడింది. అసలు ఈ రేసు నిర్వహణకు ప్రతిపాదనలు ఎలా సిద్ధం చేశారనే దానిపై లోతుగా పరిశీలిస్తున్నారు ? ఎవరు ఆమోదించారు? ఖర్చులు ఎలా అంచనా వేశారనే దానిపై కూపీ లాగుతున్నారు. మరోవైపు ఫార్ములా వన్ రేసు చెల్లింపులు ఎలా జరిపారనే కోణంపై ఈడీతో పాటు ఏసీబీ దర్యాప్తు సారించనున్నారు. దీనికి సంబంధించిన ప్రతి దస్త్రం తెప్పించుకునే పనిలో పడింది. ఈ ప్రక్రియలో పాల్గొన్న ఉద్యోగుల వివరాలను సేకరిస్తున్నారు. అవసరమయ్యే పక్షంలో వారందరి వాంగ్మూలం నమోదు చేయనున్నారు. ఈ వ్యవహారంలో నిబంధనలు ఏమి చెబుతున్నాయి, ఉల్లంఘనలు ఎక్కడ జరిగాయి కోణంలో దర్యాప్తు చేయనున్నట్టు తెలుస్తోంది. కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దని మాత్రమే హైకోర్టు చెప్పింది. దీంతో కేటీఆర్ తో పాటు ఈ కేసులో మిగతా ఇద్దరు నిందితులను ఏసీబీ కార్యాలయానికి పిలిపించి విచారించే అవకాశమైతే ఉంది. .
మరోపక్క ఈడీ (ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ) కూడా సోమవారం నుంచి దూకుడు పెంచనుంది. అవసరమైన ఫైల్స్ పంపమని పురపాలక పట్టణాభివృద్ధి సంస్థకు లేఖ రాయనున్నారు. దీనికి సంబంధించి సర్టిఫైడ్ జిరాక్స్ కాపీలు సేకరించి ఇందులో విదేశీ సంస్థకు చెల్లింపులు, నగదు లావాదేవీలకు సంబంధించిన వివరాలను రాబట్టనున్నారు. ఆ తర్వాత నిందితులకు నోటీసులు జారీ చేసి విచారించడంతోపాటు వారి వాంగ్మూలం కూడా నమోదు చేయనుంది.
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.