EX MP Mohammad Azharuddin: మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ అధికార పార్టీకి షాక్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలిసింది. గత కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని అంటిబెట్టుకుని ఉన్నారు అజారుద్దీన్. తెలంగాణలో పుట్టిపెరిగినా.. పార్టీ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ ఆయన పోటీ చేశారు. 2009లో ఉత్తరప్రదేశ్‌లో మొరదాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీచేసి గెలుపొందారు. 2014లో రాజస్థాన్‌లోని టోంక్ ఎంపీ స్థానంలో కూడా పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో పరాజయం చెందారు. ఆ తరువాత హెచ్‌సీఏ అధ్యక్షుడిగా గెలుపొందారు.
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టాన ఆఖరు నిమిషంలో అజారుద్దీన్‌కు జూబ్లీహిల్స్ టికెట్ కేటాయించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఎన్నికల్లో ఓటమిపాలైనా.. ఏదో ఒక కోటాలో ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆయన ఆశించారు. అయితే ఎమ్మెల్యే కోటాలోనూ, గవర్నర్ కోటాలోనూ.. రెండింటిలోనూ అజారుద్దీన్ పేరు లేదు. దీంతో ఆయన అసంతృప్తితో ఉన్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీలో కొనసాగడం ఇష్టంలేక.. ఆ పార్టీ సభ్యత్వానికి.. TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. మరి అజారుద్దీన్ అడుగులు ఎటు వైపు ఉంటాయో చూడాలి.
Also Read: Geysers Usage: గీజర్ ను ఆన్ లో పెట్టేసి స్నానం చేస్తున్నారా...?.. మీరు ఈ రిస్క్ లో పడ్డట్లే..
Also Read: MP Bandi Sanjay: ఎన్నికల్లో మీ దమ్మేందో చూపించండి.. ఓటనే ఆయుధంతో ఉచకోత కోయండి: బండి సంజయ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter