మాజీ మంత్రి సునితా లక్ష్మారెడ్డి అరెస్ట్

మాజీ మంత్రి సునితా లక్ష్మారెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

Last Updated : Aug 15, 2018, 07:15 PM IST
మాజీ మంత్రి సునితా లక్ష్మారెడ్డి అరెస్ట్

మెదక్ జిల్లా నర్సాపూర్‌లో బుధవారం మాజీ మంత్రి సునితా లక్ష్మారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నర్సాపూర్‌లో సునితా లక్ష్మా రెడ్డి తన భర్త లక్ష్మా రెడ్డి వర్ధంతి సభను నిర్వహించేందుకు ప్రయత్నించారు. అయితే, ప్రస్తుతం 144 సెక్షన్ అమలులో ఉన్నందున ఎటువంటి వేడుకలు, సభలకు అనుమతించేది లేదని పోలీసులు తేల్చిచెప్పారు. తమ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తంచేసిన సునితా లక్ష్మా రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, స్థానిక నేతలతో కలిసి అంబేద్కర్‌ చౌరస్తాలో ఆందోళన చేపట్టారు. 

ఎంత నచ్చచెప్పినా సునితా లక్ష్మారెడ్డి తమ ఆందోళన విరమించుకోకపోవడంతో పోలీసులు సునితారెడ్డి సహా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమని అదుపులోకి తీసుకోవడంపై సునితా లక్ష్మా రెడ్డి స్పందిస్తూ.. రాజకీయంగా తమను ఎదుర్కొనే ధైర్యం లేకే టీఆర్ఎస్ నేతలు తనపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని అన్నారు.

Trending News