MLA Wife Suicide: చొప్పదండి ఎమ్మెల్యే సతీమణి సూసైడ్‌.. రెండురోజులుగా ఇంట్లోనే ఉంటున్న రూపాదేవి అసలు ఏం జరిగిందంటే?

Choppadandi MLA Wife Suicide: చొప్పదండి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన గురువారం సాయంత్రం అల్వాల్‌లోని పంచశీలకాలనీలోని తమ ఇంట్లో జరిగినట్లు సమాచారం.

Written by - Renuka Godugu | Last Updated : Jun 21, 2024, 08:07 AM IST
MLA Wife Suicide: చొప్పదండి ఎమ్మెల్యే సతీమణి సూసైడ్‌.. రెండురోజులుగా ఇంట్లోనే ఉంటున్న రూపాదేవి అసలు ఏం జరిగిందంటే?

Choppadandi MLA Wife Suicide: చొప్పదండి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన గురువారం సాయంత్రం అల్వాల్‌లోని పంచశీలకాలనీలోని తమ ఇంట్లో జరిగినట్లు సమాచారం. ఆమె ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలస్తోంది. కాగా సత్యం రూపాదేవిలు 12 ఏళ్ల క్రితం ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కుమారుడు  యోజిత్ (11 ), కుమార్తె  రిషిక శ్రీ (9) ఉన్నారు.

కాగా, రూపాదేవి మేడ్చల్‌ మునీరాబాద్‌ ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. అయితే, గత రెండు రోజులుగా ఆమె విధులకు వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నారు. గత ఏడాది పేట్‌ బషీరాబాద్‌లోని దవేరియా విల్లాస్‌లో ఉండేవారు. అయితే, గత నెలలోనే అల్వాల్‌లోని పంచశీల కాలనీ రోడ్‌ నెంబర్‌ 12 లో నివాసం ఉంటున్నారు. ఆమె మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించనున్నారు. అయితే, ఇటీవలె వీరు కుటుంబ సభ్యులతో తిరమల దర్శనం వెళ్లి వచ్చారు. ఇంతలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే,గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నట్లు సమాచారం. 

ఇదీ చదవండి: త్వరలో తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ.. ఆ నేతలకు గోల్టెన్ ఛాన్స్..

భార్య ఆత్మహత్య తెలుసుకున్న సంగతి తెలిసిన ఎమ్మెల్యే సత్యం కుప్పకూలిపోయారు. అయితే, ఆత్మహత్యకు ముందు ఎమ్మెల్యేకు భార్య వీడయో కాల్‌ చేసినట్లు తెలుస్తోంది. నిన్న సాయంత్రం వరకు ఎమ్మెల్యే సత్యం నియోజకవర్గ పర్యటనకు వెళ్లారు. ఆయన సతీమణి వీడియో కాల్‌ చేసి చనిపోతున్నట్లు చెప్పారు. ఆయన ఇంటికి చేరుకునే లోగానే రూపాదేవి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇదిలా ఉండగా మేడిపల్లి సత్యంను కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్‌ పరామర్శించారు. ఇటీవలి ఎన్నికల్లో మేడిపల్లి సత్యం మంచి మెజార్టీతో గెలుపొందారు.

ఇదీ చదవండి: సికింద్రాబాద్ లో రైలు నుంచి భారీగా ఎగిసిపడుతున్న మంటలు.. షాకింగ్ వీడియో వైరల్..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News