Sania Mirza: స్టార్ క్రికెటర్ తో సానియా పెళ్లి.. నెటిజన్లకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన మీర్జా తండ్రి..

Sania Wedding Rumours: భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా, క్రికెటర్ షమీ తో నిశ్చయమైందని ఇటీవల సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొట్టాయి.ఈ నేపథ్యంలో సానియా తండ్రి దీనిపై స్పందించారు.

1 /7

ఇటీవలి కాలంలో సినిమా స్టార్లు, క్రికెట్ ప్లేయర్ల మీద సోషల్ మీడియాలో ఎక్కువగా రూమర్లు వైరల్ అవుతున్నాయి. కొందరు నెటిజన్లు పనికట్టుకుని మరీ పుకార్లు చేయడం సర్వసాధారణంగా మారింది. 

2 /7

దీన్ని వల్ల చాలా మంది వ్యక్తిగత జీవితాలు వివాదాస్పద అంశాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా, మాజీ టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా మరోసారి వార్తలలో నిలిచారు.

3 /7

భారత టెన్నిస్ మాజీ ప్లేయర్ సానియా మీర్జా మరోసారి వార్తలలో నిలిచారు. ఇటీవల కాలంలో.. సానియా, క్రికెటర్ మహ్మద్ షమీని పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారాయి. దీనిపై తాజాగా, సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా స్పందించారు.

4 /7

సానియా పెళ్లి విషయంలో వస్తున్న వార్తలన్నిచెత్తవని కోట్టిపారేశారు. తాము అతడిని కలవలేదని, ఇలాంటి పుకార్లు వైరల్ చేయడం మానుకోవాంటూ చురకలు పెట్టారు.ఈ నేపథ్యంలో మీర్జా పెళ్లి వార్తలకు చెక్ పడినట్లు తెలుస్తోంది.

5 /7

పాక్ క్రికెటర్ షోయబ్ మాలీక్ ను సానియా.. 2010 లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక బాబు కూడా ఉన్నారు. వీరిద్దరు కూడా 2024 జనవరిలో విడిపోయారు. షరియా చట్టల ప్రకారం.. వీరు విడిపోయారు. షోయబ్ మాలీక్ , నటి సనా జావేద్ ను పెళ్లి చేసుకున్నాడు.  

6 /7

మాలీక్ తో విడిపోయిన అనంతరం, రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ క్రమంలో సానియా ఇటీవల పవిత్రమైన హజ్ యాత్రను ప్రారంభించింది. మరోవైపు మహ్మద్ షమీ 2014 లో హసీన్ జహన్ ను పెళ్లి చేసుకున్నాడు.

7 /7

 వీరి మధ్య మనస్పర్థలు రావడంతో,  భార్యతో విడిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కోర్టులో వీరి విడాకుల కేసు ఉంది. 2024 లో ఫిబ్రవరిలో నెలలో ఎడమ చీలమండ సర్జరీ చేయించుకున్నాడు. గతంలో కూడా సానియా  వ్యక్తిగత జీవితం మీద అనేక సందర్భాలలో,  అనేక రకాలుగా ట్రోలింగ్ లు జరిగిన విషయం తెలిసిందే.