Aishwarya-Abhishek: అవును డివోర్స్ తీసుకుంటున్నాను.. విడాకుల మీద క్లారిటీ ఇచ్చిన అభిషేక్ బచ్చన్..

Aishwarya Abhishek Divorce: గత కొంతకాలంగా ప్రముఖ బాలీవుడ్ జంట ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్.. విడాకులు తీసుకోబోతున్నారు అంటూ.. సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నిసార్లు వాళ్ళిద్దరూ.. కలిసి ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. కానీ వీళ్ళ విడాకుల గురించి వార్తలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఈ పుకార్లకు పెడుతూ అభిషేక్ బచ్చన్.. క్లారిటీ ఇచ్చారు. 

1 /5

బాలీవుడ్ పవర్ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ విడాకులు తీసుకోబోతున్నారు.. అనే వార్త బాలీవుడ్ లో ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. ఎన్నిసార్లు ఇద్దరూ దీని గురించి క్లారిటీ ఇచ్చినా వార్తలు మాత్రం ఆగడం లేదు. 

2 /5

తాజాగా అభిషేక్ బచ్చన్ విడాకుల గురించి ఫైనల్ క్లారిటీ ఇచ్చేశారు. "ఓకే. నేను డివర్స్ తీసుకుంటున్నాను అనే ఈ విషయం చెప్పినందుకు థాంక్యూ. మళ్లీ నేనెప్పుడూ తిరిగి పెళ్లి చేసుకోబోతున్నాను కూడా చెప్పండి" అంటూ అభిషేక్ బచ్చన్ చాలా సరదాగా ఈ పుకార్లకు చెక్ పెట్టారు. 

3 /5

"నాకు, ఐశ్వర్య కి మా జీవితాలు ఎలా బతకాలో తెలుసు. ఎవరో మూడో వ్యక్తి వచ్చి మాకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను తనని ఎంత ప్రేమిస్తున్నానో.. తను నన్ను ఎంత ప్రేమిస్తుందో నాకు తెలుసు" అని అన్నారు అభిషేక్. 

4 /5

"ఒకవేళ మీరు ఏమైనా తప్పుగా అర్థం చేసుకునే ఉంటే పర్వాలేదు అలానే ఉండండి నేను ఒక పబ్లిక్ ఫిగర్ ని అందర్నీ నేను ఎప్పుడు ఇంప్రెస్ చేస్తూ కూర్చోలేను. మీడియా ఏం చెప్తుంది అనే దానిమీద.. నా పెళ్లి కానీ, నా జీవితం కానీ నడవవు. కాబట్టి నాకు అసలు అది ఒక ప్రాబ్లం కూడా కాదు" అని సింపుల్ గా తేల్చి చెప్పారు అభిషేక్ బచ్చన్. 

5 /5

ధూమ్ 2 షూటింగ్ సెట్స్ మీద మొదటిసారి కలుసుకున్న ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్ల మధ్య స్నేహం ప్రేమగా మారడానికి ఎక్కువ కాలం పట్టలేదు. 2007లో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. 2011లో వీళ్ళిద్దరికీ ఆరాధ్య అనే ఒక పాప కూడా పుట్టింది. సోషల్ మీడియాలో ఆరాధ్య బచ్చన్ ఫోటోలు కూడా ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి.