Ram Charan-Upasana: వైరల్ అవుతున్న క్లింకార వీడియో…పండగ చేసుకుంటున్న మెగా అభిమానులు

Upasana Konidela: మెగా కుటుంబం ఇవాళ రామ్ చరణ్ కూతురు క్లీన్ కార.. మొదటి పుట్టిన రోజును.. అంగరంగ వైభవంగా జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో.. క్లీంకార పుట్టినప్పుడు తీసిన ఒక అందమైన వీడియో ని ఉపాసన ఇన్స్టా గ్రామ్ ద్వారా షేర్ చేశారు. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 20, 2024, 05:12 PM IST
Ram Charan-Upasana: వైరల్ అవుతున్న క్లింకార వీడియో…పండగ చేసుకుంటున్న మెగా అభిమానులు

Upasana Konidela Instagram: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనల ఏకైక ముద్దుల కుమార్తె.. క్లిన్ కారా.. పుట్టి ఇవాళ్టికీ సంవత్సరం గడిచింది. తమ గారాల పట్టి మొదటి పుట్టిన రోజు గుర్తుగా.. ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్‌ లో క్లీన్ కార పుట్టినప్పుడు తమ కుటుంబ సభ్యుల.. భావోద్వేగాలు ఉన్న ఒక అందమైన వీడియోను షేర్ చేశారు.

"నా డార్లింగ్ క్లీంకార కి మొదటి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నువ్వు మమ్మల్ని కంప్లీట్ చేసావు. మా జీవితాల్లోకి ఇంత ఆనందం తెచ్చినందుకు ధన్యవాదాలు. నేను ఈ వీడియోను ఒక లక్ష సార్లు.. చూసుంటాను." అంటూ వీడియోని పోస్ట్ చేసింది ఉపాసన. 

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)

ఈ వీడియోలో రామ్ చరణ్ ఉపాసన మాత్రమే కాకుండా..చిరంజీవి, సురేఖ, ఉపాసన తల్లిదండ్రులు, చెల్లెలు ఇలా కుటుంబ సభ్యులు అందరూ క్లీన్ కార.. రాకపై తన ఆనందాన్ని పంచుకున్నారు. రామ్ చరణ్ ఉపాసనల పెళ్లికి సంబంధించిన కొన్ని గ్లింప్సెస్.. కూడా ఈ వీడియో లో ఉన్నాయి. క్లీన్ కార పుట్టినప్పుడు రామ్ చరణ్ ..తన కుటుంబానికి పరిచయం చేసిన దృశ్యాలు కూడా చాలా అందంగా చిత్రీకరించారు. ఈ వీడియోలో తండ్రి అయినందుకు చెర్రీ ఆనందం వర్ణనాతీతంగా కనిపించింది.

అయితే ఇదేమి కొత్త వీడియో కాదు. గతంలో క్లీంకార పుట్టినప్పుడే రామ్ చరణ్ ఈ వీడియోని అభిమానులతో పంచుకున్నారు. మొదటి పుట్టినరోజు సందర్భంగా.. ఉపాసన కూడా ఈ వీడియోని షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. మెగా అభిమానులు అందరూ క్లీన్ కారకు.. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆమెను ఆశీర్వదిస్తున్నారు. కొందరు క్లీన్ కార ఫోటోలు కూడా పంచుకుంటే.. ఇంకా బావుంటుంది అని కామెంట్లు చేస్తున్నారు.

ఇక సినిమాల పరంగా చూస్తే రామ్ చరణ్.. హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమా త్వరలో విడుదల కి సిద్ధమవుతోంది. ఈ సినిమాలో కియారా అద్వానీ.. హీరోయిన్ గా నటిస్తుంది. కొద్ది రోజుల్లో సినిమాకి సంబంధించిన షూటింగ్ పూర్తి కాబోతోంది. అన్నీ అనుకూలిస్తే.. సినిమా డిసెంబర్ లో విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డిసెంబర్ 20 ని సినిమా విడుదల తేదీ గా చిత్ర బృందం త్వరలో ప్రకటించనుంది.

Also Read: O Manchi Ghost: థియేటర్లకు రండి.. హాయిగా నవ్వుకుని వెళ్లండి: OMG మూవీ టీమ్

Also Read: Bharatheeyudu 2: కమలహాసన్ పరిస్థితి ఇలా అయింది ఏమిటి..? భారతీయుడు 2 థియేట్రికల్ బిజినెస్ పై నీలి నీడలు.. ?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News