Free DSC Coaching in AP: రాష్ట్రంలో మెగా డీఎస్సీపై సీఎం చంద్రబాబు నాయుడు సంతకం చేయడంతో నిరుద్యోగులు ప్రిపేరేషన్‌లో బిజీగా ఉన్నారు. తాజాగా మంత్రి సంజీవిరెడ్డిగారి సవిత మరో గుడ్‌న్యూస్ చెప్పారు. రాష్ట్రంలోని బీసీ స్టడీ సర్కిళ్లలో వెనకబడిన తరగతుల విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉచిత డీఎస్సీ కోచింగ్ అందించే ఫైల్‌పై ఆమె తొలి సంతకం చేశారు. రాష్ట్ర వెనకబడిన తరగతుల సంక్షేమం, ఈడబ్ల్యూఎస్, చేనేత జౌళి శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే బీసీ స్టడీ సర్కిళ్లలో ఫ్రీ డీఎస్సీ కోచింగ్, ఎన్టీఆర్ విదేశీ విద్య పథకం కొనసాగింపు పథకాలపై తొలి రెండు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు నిరుద్యోగుల కోసం మెగా డీఎస్సీ ఫైల్‌పై మొదటి సంతకం చేశారని.. తాను కూడా ఆయన అడుగుజాడల్లో వెనకబడిన తరగతుల్లోని నిరుద్యోగులకు ఫ్రీ డీఎస్సీ కోచింగ్ ఫైల్‌పై తొలి సంతకం చేసినట్లు చెప్పారు.
ఎన్టీఆర్ విదేశీ విద్య పథకాన్ని కొనసాగించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. అదేవిధంగా వెనకబడిన తరగతుల సంక్షేమం కోసం త్వరలోనే బీసీ కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. 2014 నుంచి 2019 వరకు ఉమ్మడి 13 జిల్లాలకు మంజూరు చేసిన బీసీ భవన్‌ల నిర్మాణాలను కూడా పూర్తి చేస్తామని చెప్పారు. తమ ప్రభుత్వంలో చేనేత కళాకారులు, హస్త కళాకారులకు తగిన సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. వారంలో ఒక్కసారైనా సచివాలయ ఉద్యోగులు, రాష్ట్ర ప్రజలు చేనేత వస్త్రాలు ధరించాలని కోరారు.
బీసీ కులానికి చెందిన మహిళకు వెనకబడిన తరగతుల మంత్రిగా అవకాశం ఇచ్చినందుకు సీఎం చంద్రబాబు నాయుడికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. విభజన నాటికి రాష్ట్రంలో 32 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయని.. చంద్రబాబు 106కి పెంచారని గుర్తు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రం బాగుండాలనే తపన కలిగిన వ్యక్తి అని పొగిడారు. దేశానికి బీసీ నాయకుడు ప్రధానమంత్రిగా ఉన్న టైమ్‌లో తనకు రాష్ట్రంలో బీసీ సంక్షేమ శాఖకు మంత్రిగా పని చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పకొచ్చారు.
Also Read: Sexual Assault: పోర్న్ చూస్తూ సొంత బిడ్డపై తండ్రి లైంగిక దాడి.. నాన్న అనే పేరుకే కళంకం వీడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter