CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డి పులి స్వారీ చేస్తున్నారని ఆయన పులి మీద నుంచి దిగితే అది ఆయనను మింగేస్తుందని హైడ్రా కూల్చివేతలపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ నేడు సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా పేరిట అక్రమ నిర్మాణాలను కూల్చుతున్న నేపథ్యంలో కొంతమంది పెద్దల ఒత్తిడితో సీఎం రేవంత్ రెడ్డి జైలుకు సైతం వెళ్లే ప్రమాదం ఉందని నారాయణ పేర్కొన్నారు. హైడ్రా కూల్చివేతల వల్ల బడా బాబుల జాతకాలు అన్ని బయట పడుతున్నాయని వీరంతా ఊరికే కూర్చోరని కచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తారని ఒకవేళ వారి ఒత్తిళ్లకు లొంగినా లొంగకపోయినా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం మాత్రం ఖాయమని నారాయణ బాంబు లాంటి వార్త పేల్చారు. అంతేకాదు ఆయనను జైలుకు సైతం పంపించేందుకు ఏమాత్రం వెనుకాడరని పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి ప్రస్తుతం పులి మీద స్వారీ చేస్తున్నారని మధ్యలో ఆపేస్తే పులి ఆయనను తినేస్తుందని జోస్యం చెప్పారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ ఏర్పాటుచేసిన టాస్క్ ఫోర్స్ వరుసగా కూల్చివేతలు కొనసాగిస్తూ నగరంలో బడాబాబుల ఆక్రమణలకు చెక్ పెడుతోంది. ఇప్పటికే సినీ నటుడు నాగార్జున ఎన్కన్వెన్షన్ సెంటర్ తొలగింపు అనంతరం హైడ్రా మరింత స్పీడ్ పెంచింది.
Also Read : Highest FD Interest Rates: ఈ బ్యాంకులో బంపర్ ఆఫర్.. ఎఫ్డీపై ఏకంగా 9.5 శాతం వడ్డీ
తాజాగా శేరిలింగంపల్లి రాయదుర్గంలోని ప్రభుత్వ భూముల్లోని పలు అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు నిర్మూలించారు. అలాగే రాయదుర్గం లోని పలు సర్వే నెంబర్లలో ఉన్న అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. అయితే తమకు నోటీసులు ఇవ్వకుండా అలా ఎలా కూల్చివేస్తారంటూ స్థానికులు జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులను నిలదీస్తున్నారు. తమ ఇళ్ళను కూల్చవద్దని వాగ్వాదానికి దిగుతున్నారు.
మరోవైపు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, అలాగే ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ సైతం హైడ్రా కూల్చివేతలపై స్పందించారు. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ లాలాపై నిర్మించిన జిహెచ్ఎంసి ఆఫీసు సైతం అక్రమ నిర్మాణమని అక్కడ ఒకప్పుడు నాలా ఉండేదని దానిపైనే జిహెచ్ఎంసి ఆఫీసులో నిర్మించారని ఇది అక్రమ కట్టడమేనని గుర్తు చేశారు.
Read Also : Kangana Ranaut : కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు.. కన్నెర్ర జేసిన సొంత పార్టీ
అదే సమయంలో హిమాయత్ సాగర్ వద్ద కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీఎంబి సంస్థ కూడా అక్రమ కట్టడమే అవుతుందని అది FTL పరిధిలో ఉందని కూడా గుర్తు చేశారు. అలాంటప్పుడు ప్రభుత్వ కూల్చివేస్తారని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ సల్కం చెరువు సమీపంలో ఉన్న ఓవైసీ విద్యా సంస్థల జోలికి రావద్దని ఒకవేళ రావాల్సి వస్తే తనపై బుల్లెట్ల వర్షం కురిపించమని హెచ్చరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.