Cm Kcr Fire On Governors: దేశంలో గవర్నర్‌ల వ్యవస్థపై సీఎం కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు

Cm Kcr Fire On Governors: దేశంలో పలు రాష్ట్రాల్లో గవర్నర్‌లు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు సీఎం కేసీఆర్. పలు రాష్ట్రాల్లో నెలల తరబడి ఫైల్స్‌ పెండింగ్‌లో పెట్టుకున్నారని విమర్శించారు. ఎన్టీఆర్‌ రాజకీయ చరిత్రను మరిచిపోవద్దని గుర్తు చేశారు సీఎం కేసీఆర్

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 27, 2022, 01:53 PM IST
  • గవర్నర్‌ల వ్యవస్థపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సీఎం కేసీఆర్‌
  • మహారాష్ట్రలో నెలల తరబడి ఫైల్స్ పెండింగ్‌లో పెట్టుకున్నారు- కేసీఆర్
  • ఎన్టీఆర్ రాజకీయ చరిత్రను మరిచిపోవద్దు-సీఎం కేసీఆర్
Cm Kcr Fire On Governors: దేశంలో గవర్నర్‌ల వ్యవస్థపై సీఎం కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు

Cm Kcr Fire On Governors: టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం వేదికగా సీఎం కేసీఆర్‌ గవర్నర్ల వ్యవస్థపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహారాష్ట్రలో నెలల తరబడి ఫైల్స్ పెండింగ్‌లో పెట్టుకున్నారని విమర్శించారు. బెంగాల్- మహారాష్ట్రతో పాటు చాలా రాష్ట్రాల్లో గవర్నర్లతో రాజకీయం చేస్తున్నారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఎన్టీఆర్ రాజకీయ చరిత్రను మరిచిపోవద్దని సూచించారు. ఎన్టీఆర్‌ను ఇబ్బంది పెట్టిన గవర్నర్..అవమానపడి వెళ్లిపోయారని గుర్తు చేశారు. మృగాళ్లలాగా కత్తులతో రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్‌ ఆశయం కోసం కొత్త రాజకీయ శక్తి అవిర్భవించాలని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. దేశం కోసం టీఆరెఎస్ ఉజ్వలమైన పాత్ర వహిస్తుందని చెప్పారు.

తెలంగాణ కోసం టీఆర్ఎస్‌ పుట్టినట్లే దేశం కోసం ఒక శక్తి తప్పకుండా పుడుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ తరహాలోనే భూకంపం పుట్టించి..విద్రోహ శక్తులను తరిమికొడుదామని పిలుపునిచ్చారు. కుటిల రాజకీయాలు చేయడం చాలా సులువు అని చెప్పారు. పదవుల కోసం ఏమైనా చేస్తారా అని ప్రశ్నించారు. కుటిల బుద్ధితో కూలగొట్టడం ఈజీ- కానీ నిలబెట్టడం కష్టమన్నారు. హిజాబ్ అంశంతో కర్ణాటక రాష్ట్రం అట్టుడుకుతోందని తెలిపారు. దేశంలో ఎవరూ ఏ మతమైన స్వీకరించవచ్చన్నారు. విదేశాల్లో ఉన్న 13 కోట్ల మందిని ఆ దేశాలు వెల్లగొడితే ఈ దేశం సాదుతుందా అని నిలదీశారు. దేశం ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతోందన్నారు. సమసిపోయిన గాయాల పై కారం చల్లుతున్నారని మండిపడ్డారు. మత పిచ్చితో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. పిచ్చి కొట్లాటలు పెట్టి దేశాన్ని ఎమ్ చేద్దాం అనుకుంటున్నారని ప్రశ్నించారు.

కత్తులు- తుపాకులు పట్టుకొని ఊరేగింపులా..?మతం- కులం పేరుతో విద్వేషాలతో పొడుచుకొని చావాలా అని నిలదీశారు సీఎం కేసీఆర్‌. దేశంలో గలీజ్ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీ గద్దెనెక్కాల్సింది ప్రజలు- పార్టీలు కాదన్నారు.ఎవరినో గద్దె దించడానికో- ఎక్కించడానికే కూటములు పెట్టొద్దన్నారు. రావాల్సింది రాజకీయ ఫ్రంట్‌లు కాదు..డొల్ల కళ్ల మాటలు కావు- దేశాన్ని అభివృద్ధి చేసే ఎజెండా కావాలన్నారు. ప్రత్యామ్నాయ గుంపు కాదు- కూటమి కాదు ప్రత్యామ్నాయ ఎజెండా కావాలని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్‌.అనాలోచితమైన ఆలోచనలు దేశంలో అమలు అవుతున్నాయని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అందుబాటులో ఉన్న విద్యుత్‌ను కేంద్రం ఉపయోగించుకోవడం లేదని ఆరోపించారు. దేశంలో నీటి యుద్ధాలు జరగటానికి కారణం ఎవరని నిలదీశారు. దేశం ఉజ్వలమైన భవిష్యత్ కోసం మన పాత్ర పోషించాలని సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ప్లీనరీ వేదికగా సీఎం కేసీఆర్ వెల్లడించారు.

Also Read: Cm Ys Jagan: Cm Ys Jagan: 2024 ఎన్నికలకు టార్గెట్ ఫిక్స్‌ చేసిన సీఎం వైఎస్ జగన్

Also Read: Cm Kcr Plenary: Cm Kcr Plenary: టీఆర్ఎస్‌కు తెలంగాణ పెట్టని కోట: సీఎం కేసీఆర్

Also Read: Tamilnadu: తమిళనాడులో ఘోర విషాదం... రథోత్సవంలో విద్యుత్ షాక్‌తో 11 మంది మృతి...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News