KCR Effigy Hanged to Electric Pole: తెలంగాణ బడ్జెట్ సమావేశాల తొలిరోజే ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడంపై ఆ పార్టీ వర్గాలు భగ్గుమంటున్నాయి. దీనిపై ఇప్పటికే ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌కు ఫిర్యాదు చేశారు. హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. మరోవైపు, ఈ వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు నిరసనలకు దిగుతున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ ఇలాఖా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేసీఆర్ దిష్టిబొమ్మను ఎలక్ట్రిక్ స్తంభానికి ఉరి తీసి స్థానిక బీజేపీ నేతలు నిరసన తెలిపారు. పట్టణంలోని ఓ రోడ్డు మార్గంలో ఉన్న లైటింగ్ పోల్కి కేసీఆర్ దిష్టిబొమ్మను వేలాడదీశారు.
సస్పెన్షన్‌పై రఘునందన్ రావు ఆగ్రహం :
అసెంబ్లీ నుంచి తమను సస్పెండ్ చేయడం అసెంబ్లీ నిబంధనలకు, రాజ్యాంగానికి విరుద్ధమని రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ తమ స్థానాల్లో నిలబడే తాము పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను లేవనెత్తామని అన్నారు. సభలో కాంగ్రెస్‌కి చెందిన ఐదుగురు సభ్యులు నిరసన తెలిపినా.. సభకు అంతరాయం కలిగించినా వారిని సస్పెండ్ చేయలేదన్నారు. కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేస్తే సభకు అంతరాయం కలగలేదా అని ప్రశ్నించారు. ఇది పక్షపాతం అవునా కాదా అని నిలదీశారు.
ఒకవేళ నల్ల కండువాలు వేసుకుని సమావేశాలకు హాజరవడం తప్పయితే.. రాజ్యాంగంలో నల్ల కండువా వేసుకోవద్దని ఎక్కడైనా ఉందా అని రఘునందన్ రావు ప్రశ్నించారు. బీజేపీ సభ్యులు లేకుండా సభను నడపాలనే ముందస్తు ప్లాన్‌తోనే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారని ఆరోపించారు. నిజానికి హరీష్ రావు బడ్జెట్ స్పీచ్ ఇస్తున్నప్పుడు... సభ ఆర్డర్లో లేదని ఆయన పేర్కొనలేదన్నారు. కేసీఆర్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో చీటీ పంపించాకే హరీష్ రావు బడ్జెట్ స్పీచ్ ఆపారని అన్నారు. నిబంధన 340, సబ్ క్లాస్ 1 ప్రకారం తమను సస్పెండ్ చేసినట్లు చెబుతారని.. కానీ తమ పేర్లు స్పీకర్ నోటి వెంట పలకలేదని అన్నారు. అలాంటప్పుడు తమ సస్పెన్షన్ తీర్మానం చెల్లదన్నారు.
Also Read: Trending News: సోషల్ మీడియా చేసిన సెలెబ్రెటీ- మోడల్‌గా మారిన బొమ్మలు అమ్మే యువతి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook