Harish Rao Vs Revanth reddy: హరీష్ రావుకు బిగ్ షాక్.. పంజాగుట్ట పీఎస్ లో కేసు నమోదు. ఎందుకంటే..?

Brs Harish Rao: బీఆర్ఎస్ నేత హరీష్ రావుపై పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో కేసు నమోదనట్లు తెలుస్తొంది. దీంతో ప్రస్తుతం ఈ ఘటన తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Dec 3, 2024, 01:05 PM IST
  • మాజీ మంత్రిపై కేసు నమోదు..
  • మరొసారి రాజుకున్న వివాదం..
Harish Rao Vs Revanth reddy: హరీష్ రావుకు బిగ్ షాక్.. పంజాగుట్ట పీఎస్ లో కేసు నమోదు. ఎందుకంటే..?

case filed on former minister harish rao: తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలు చలికాలంలో హీట్ ను పుట్టిస్తున్నాయని చెప్పుకొవచ్చు. ఒక వైపు బీఆర్ఎస్ చేసిన తప్పిదాల వల్లే.. తెలంగాణ వెనక్కు పోయిందని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంది. మరొవైపు బీఆర్ఎస్ మాత్రం.. 420 హమీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కూడా కౌంటర్ ఇస్తుంది. ఇచ్చిన హమీలు కాంగ్రెస్ మెడలు వంచి మరీ అమలు చేసేలా చేస్తామని కూడా బీఆర్ఎస్ గట్టిగానే ఏకీపారేస్తుంది.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఇటీవల బీఆర్ఎస్ నేతలను సీఎం రేవంత్ రెడ్డి తన విమర్శలతో చుక్కలు చూపిస్తున్నారు. అదే విధంగా కేటీఆర్, హరీష్ రావు సైతం.. తాము కూడా తగ్గేదేలా అన్నట్లు కాంగ్రెస్ కు కౌంటర్ ఇస్తున్నారు. దీంతో తెలంగాణ రాజకీయం మాత్రం రసవత్తరంగా మారిందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో ప్రస్తుతం..బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావుపైన పంజాగుట్ట పీఎస్ లో కేసు నమోదు అయినట్లు తెలుస్తొంది.

సిద్దిపేటకు చెందిన చక్రధర్ అనే వ్యక్తి.. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండగా.. అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధకిషన్ తో కలిసి తన ఫోన్ లు ట్యాపింగ్ లకు పాల్పడ్డారని, తనపై అక్రమ కేసులు బనాయించి, మానసికంగా వేధించారని కూడా సదరు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తొంది.

Read more: Kodada: ఎమ్మెల్యే పద్మావతికి మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి భారీ గిఫ్ట్‌.. ఏమిటో తెలుసా?

దీంతో పంజాగుట్ట పోలీసులు.. 120(బి), 386, 409, 506, రెడ్ విత్ 34 , ఐటీయాక్ట్ చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తొంది. దీంతో ప్రస్తుతం  ఈ ఘటన తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిందని చెప్పుకొవచ్చు.

Trending News