OU Hostels Close: తెలంగాణలో మరో వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. ఇప్పటికే విద్యుత్ కోతలు, తాగునీటి కొరతపై రాజకీయంగా తీవ్ర వివాదం ఏర్పడగా.. తాజాగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇవే కారణాలతో వసతిగృహాలను మూసివేస్తున్నట్లు ప్రకటించడం మరింత అగ్గి రాజేసింది. 'తాగునీరు, విద్యుత్ కొరతతో వసతిగృహాలకు సెలవులు ప్రకటిస్తున్నాం' అని చీఫ్ వార్డెన్ ఇచ్చిన ప్రకటనపై రాజకీయ దుమారం రేపింది. ఈ నిర్ణయంపై ఓయూ విద్యార్థులతోపాటు బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కూడా స్పందించారు. ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Amit Shah: అమిత్ షా పర్యటనలో కలకలం.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం
'తాగునీరు, విద్యుత్ కొరత కారణంగా మే 1వ తేదీ నుంచి 31 వరకు వసతిగృహాలు, మెస్‌లు మూసివేస్తున్నాం' అని ఓయూ చీఫ్ వార్డెన్ డాక్టర్ కొర్రెముల శ్రీనివాస్ ప్రకటన జారీ చేశారు. ఈ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. విద్యుత్ అంతరాయంతో అర్ధరాత్రి పూట విద్యార్థులు రోడ్డు బయటకు వచ్చి నిరసనలకు దిగిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు.
Also Read: Asaduddin Owaisi: ముస్లింలే ఎక్కువ కండోమ్‌లు వాడుతున్నారు: అసదుద్దీన్
ఇక ఓయూ విద్యార్థుల ఆందోళన, ఓయూ చీఫ్ వార్డెన్ ప్రకటనపై మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'తెలంగాణలో నాలుగు నెలలుగా విద్యుత్, సాగునీరు, తాగునీటి సరఫరాపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. దీనికి ఉస్మానియా విశ్వవిద్యాలయం చీఫ్ వార్డెన్ జారీ చేసిన నోటిసులే తాగునీటి, విద్యుత్ కొరతకు నిదర్శనం. తెలంగాణలో విద్యుత్, తాగునీరు, సాగునీరు కొరత ఉన్నమాట వాస్తవం' అని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు 'ఎక్స్'లో కేసీఆర్ పోస్టు చేశారు. దీంతోపాటు ఓయూలో విద్యార్థుల ఆందోళన వీడియో, చీఫ్ వార్డెన్ ఇచ్చిన ప్రకటన ఫొటోను పంచుకున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter