టిఎస్ఆర్టీసీ సమ్మె: తెలంగాణ ప్రభుత్వానికి హై కోర్టులో చుక్కెదురు

టిఎస్ఆర్టీసీలో 5,100 రూట్లలో ప్రైవేటు బస్సులు ప్రవేశపెట్టాలన్న తెలంగాణ కేబినెట్ నిర్ణయంపై స్టే విధించిన తెలంగాణ హై కోర్టు

Last Updated : Nov 8, 2019, 02:40 PM IST
టిఎస్ఆర్టీసీ సమ్మె: తెలంగాణ ప్రభుత్వానికి హై కోర్టులో చుక్కెదురు

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి హై కోర్టులో చుక్కెదురైంది. టిఎస్ఆర్టీసీలో 5,100 రూట్లలో ప్రైవేటు బస్సులు ప్రవేశపెట్టాలన్న తెలంగాణ కేబినెట్ నిర్ణయంపై తెలంగాణ హై కోర్టు శుక్రవారం స్టే విధించింది. తెలంగాణలో 5,100 రూట్లలో ప్రైవేటు బస్సులు ప్రవేశపెట్టాలని కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ తెలంగాణ జన సమితి(టీజేఎస్) ఉపాధ్యక్షుడు పిఎల్ విశ్వేశ్వర రావు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా హై కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. సోమవారం లోగా అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా అదనపు ఆడిటర్ జనరల్ ని ఆదేశించిన కోర్టు.. పిటిషన్ విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

5,100 రూట్లను ప్రైవేటీకరించాలని సర్కార్ తీసుకున్న నిర్ణయంపై హై కోర్టు స్టే విధించడాన్ని ఆర్టీసీ కార్మిక సంఘాలు హర్షం వ్యక్తంచేశాయి. దీనిని కార్మికుల తొలి విజయంగా పేర్కొన్న సంఘాల నేతలు.. ఇకనైనా ప్రభుత్వం తమ సమస్య పరిష్కారంపై దృష్టిసారిస్తే బాగుంటుందని డిమాండ్ చేశాయి.

Trending News