Sai Pallavi: మరో వివాదంలో సినీ నటి సాయి పల్లవి..పోలీస్ స్టేషన్‌కు చేరిన పంచాయతీ..!

Sai Pallavi: సినీ సెలబ్రెటీలు వివాదాల్లో చిక్కుకోవడం సర్వ సాధారణంగా మారుతోంది. సినీ ప్రమోషన్ల కోసం కొంతమంది ఇలా చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. తాజాగా సినీ నటి సాయి పల్లవి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్‌ దాకా చేరింది.

Written by - Alla Swamy | Last Updated : Jun 17, 2022, 09:11 AM IST
  • వివాదంలో సినీ నటి సాయి పల్లవి
  • దుమారం రేపుతున్న వివాదాస్పద వ్యాఖ్యలు
  • తాజాగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
Sai Pallavi: మరో వివాదంలో సినీ నటి సాయి పల్లవి..పోలీస్ స్టేషన్‌కు చేరిన పంచాయతీ..!

Sai Pallavi: విరాట పర్వం సినిమా ప్రమోషన్ల భాగంగా ఇటీవల సినీ నటి సాయి పల్లవి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. తాజాగా హైదరాబాద్‌ సుల్తాన్ బజార్‌ పోలీస్‌ స్టేషన్‌లో బజరంగ్ దళ్‌ సభ్యులు ఫిర్యాదు చేశారు. ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాతోపాటు గోరక్ష సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

వీటిని పరిశీలించి న్యాయ నిపుణుల సలహా మేరకు ముందుకు వెళ్తామని పోలీసులు చెబుతున్నారు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ ఛానల్‌కు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈక్రమంలోనే సాయి పల్లవికి అనుకోని ప్రశ్న ఎదురైంది. మీరు లెఫ్టా లేక రైటా అంటూ యాంకర్‌ ప్రశ్నించారు. తాను ఒక న్యూట్రల్ ఫ్యామిలీ నుంచి వచ్చానని..అందుకే న్యూట్రల్‌గా ఉంటానని తెలిపారు. అణచివేతకు గురయ్యే వారిని రక్షించే మనస్తత్వమన్నారు.

ఈక్రమంలో కాశ్మీర్ ఫైల్స్ సినిమా ప్రస్తావనకు వచ్చింది. ఈ సినిమాలో పండితులపై జరిగే దాడులకు..గోరక్ష పేరుతో జరిగే దాడికి తేడా ఏముందన్నారు. ఇప్పుడా వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. సాయి పల్లవి వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. సినిమా ప్రమోషన్‌ కోసం ఎంతకైనా దిగజారుతారా అని ప్రశ్నిస్తున్నారు. ఇటు నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. విరాట పర్వం సినిమాను బహిష్కరించాలని పిలుపునిస్తున్నారు.

Also read: APSRTC: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలపై ఛార్జీల పిడుగు..త్వరలో అధికారిక ప్రకటన..!

Also read: Cooking Oils Rates: సామాన్యులకు గుడ్‌న్యూస్..వంట నూనెల ధరలు ఎంతమేర తగ్గాయో తెలుసా..?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News