Sonia Gandhi: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ చర్యలు చేపటప్టింది. ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధ్యక్షులు రాజీనామా చేయాలని పార్టీ గౌరవ అధ్యక్షురాలు సోనియా ఆదేశించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రన్‌దీప్ సుర్జేవాలా వెల్లడించారు.
Why Congress Party Lost UP elections 2022: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ షోకు ఆ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ కూడా కారణామా ? సర్వత్రా ఇప్పుడిదే చర్చ జరుగుతోంది. అటు పంజాబ్‌లో అధికారాన్ని కోల్పోయి.. ఇటు యూపీలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది హస్తం పార్టీ. ఉత్తరప్రదేశ్‌లో కేవలం రెండు సీట్లు మాత్రమే కాంగ్రెస్‌కి దక్కాయి.
UP Election Result: ఉత్తరప్రదేశ్‌లో వరుసగా రెండోసారి అధికారాన్ని చేపట్టేందుకు అధికార బీజేపీ పార్టీ సిద్ధంగా ఉంది. గతంలో కంటే మెరుగైన సీట్లు సాధించడం వల్ల కాషాయ వర్గాల్లో సంబరాలు మొదలయ్యాయి. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటి మరీ ఎక్కువ స్థానాల్లో విజయం వైపు దూసుకుపోతోందీ కమలం పార్టీ. ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ కూడా గోరఖ్‌పూర్‌లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తానికి యోగీ ఆదిత్యనాథ్ మరోసారి అధికార పీఠాన్ని చేజిక్కించుకోబోతున్నారు. యూపీ రాజకీయాల్లో చరిత్ర సృష్టించబోతున్నారు.
UP Election officer Reena Dwivedi New Look: 2019లో ఎల్లో సారీ, స్లీవ్ లెస్ బ్లవ్జ్ వేసుకుని వచ్చిన రీనా ద్వివేది.. ఈ సారి మాత్రం వెస్ట్రన్ డ్రెస్‌లో తళుక్కుమన్నారు. బ్లాక్ స్లీవ్ లెస్ టాప్, వైట్ ప్యాంట్ ధరించారు.
Asaduddin Owaisi Z security: ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ Z సెక్యూరిటీని అంగీకరించాలని కోరారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ఆయకు ఇంకా ముప్పు పొంచి ఉందని తెలిపారు.
UP Election 2022: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' క్రేజ్ ను ఇప్పుడు రాజకీయాల్లో కూడా వాడేసుకుంటున్నారు. తాజాగా యూపీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల సాంగ్ ను రిలీజ్ చేసింది.
UP elections 2022: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సమాజ్‌వాదీ పార్టీకి పెద్ద దెబ్బ తగిలింది. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణా యాదవ్ బీజేపీలో చేరారు.
ఉత్తర్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. నేతలు పార్టీలు మారే ప్రక్రియ జోరుగా (Uttar Pradesh Assembly Election 2022) సాగుతోంది. అధికార బీజేపీని గద్దె దించాలని ఎస్పీ(సమాజ్‌వాదీ పార్టీ), బీఎస్పీలు (బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ) తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అటు బీజేపీ కూడా మరోసారి ఉత్తర్ ప్రదేశ్‌లో అధికారం చలాయించాలని ఎత్తుకు పై ఎత్తులు రచిస్తోంది.
Electricity charges in UP: యూపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు విద్యుత్ ఛార్జీలు 50 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.