UP elections 2022 Results: యూపీ ఫ్లాప్ షోకు ప్రియాంక గాంధీ కారణమా ?

Why Congress Party Lost UP elections 2022: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ షోకు ఆ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ కూడా కారణామా ? సర్వత్రా ఇప్పుడిదే చర్చ జరుగుతోంది. అటు పంజాబ్‌లో అధికారాన్ని కోల్పోయి.. ఇటు యూపీలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది హస్తం పార్టీ. ఉత్తరప్రదేశ్‌లో కేవలం రెండు సీట్లు మాత్రమే కాంగ్రెస్‌కి దక్కాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 13, 2022, 03:03 AM IST
UP elections 2022 Results: యూపీ ఫ్లాప్ షోకు ప్రియాంక గాంధీ కారణమా ?

Why Congress Party Lost UP elections 2022: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ షోకు ఆ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ కూడా కారణామా ? సర్వత్రా ఇప్పుడిదే చర్చ జరుగుతోంది. అటు పంజాబ్‌లో అధికారాన్ని కోల్పోయి.. ఇటు యూపీలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది హస్తం పార్టీ. ఉత్తరప్రదేశ్‌లో కేవలం రెండు సీట్లు మాత్రమే కాంగ్రెస్‌కి దక్కాయి. ఆ పార్టీకి దక్కినది 2.36 శాతం ఓట్లు మాత్రమే. గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్‌కు ఇదే అత్యంత చెత్త ప్రదర్శన. 2017 ఎన్నికల్లో 6.25 శాతంగా ఉన్న కాంగ్రెస్ ఓట్లు.. ఇప్పుడు భారీగా క్షీణించాయి. అప్పుడు 7 సీట్ల నుంచి ఇప్పుడు 2 సీట్లకు పడిపోయింది. యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ కుమార్ లల్లూ..అయితే బీజేపీ, ఎస్పీ తర్వాత మూడో స్థానానికి పరిమితమయ్యారు. 

కాంగ్రెస్ పరాజయానికి చాలా కారణాలున్నాయి. అయితే ప్రియాంక వైఖరి కూడా ఓ కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పంజాబ్‌ సీఎం చరణ్‌జీత్ సింగ్ చన్నీ.. ఎన్నికల ప్రచారంలో యూపీ, బీహార్ వాసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూపీ, బిహార్, ఢిల్లీకి చెందినవారంతా ఒక్కటేనని వారిని పంజాబ్‌లోకి అడుగు పెట్టనివ్వకూడదంటూ ఆమ్‌ ఆద్మీ పార్టీని ఉద్దేశించి అబోహర్‌లో జరిగిన ర్యాలీలో వ్యాఖ్యలు చేశారు. చన్నీ అలా మాట్లాడుతున్నప్పుడు పక్కనే ఉన్న ప్రియాంకా గాంధీ చప్పట్లు కొట్టడం యూపీ వాసులకు మరింత ఆగ్రహాన్ని కలిగించిందంటున్నారు. యూపీలోని ఫతేపూర్‌ ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ (PM Modi) ఇదే అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ వ్యవహారం యూపీ వాసుల్లో కాంగ్రెస్‌పై వ్యతిరేకత మరింత పెంచాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Also read : Rasamayi Balakishan: ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​కు అసెంబ్లీలో చేదు అనుభవం!

Also read :Crime News: థ‌ర్డ్ డిగ్రీ ప్రయోగించిన‌ బ‌య్యారం ఎస్సై ర‌మాదేవి.. నడవలేని స్థితిలో నిందితుడు!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News