Revanth Reddy Counter to Ministers: ఖమ్మంలో తెలంగాణ జన గర్జన సభను విజయవంతం చేసిన ఖమ్మం ప్రజలకు, నేతలకు కృతజ్ఞతలు తెలిపారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ గారి సభను విఫలం చేసేందుకు బీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. జనగర్జనకు ప్రజలు రాకుండా ప్రభుత్వం అన్ని రకాల కుయుక్తులు చేసినా.. భారీగా తరలివచ్చారని అన్నారు. అసలు నక్క తప్ప వేట కుక్కలన్నీ బయటకు వచ్చి మొరగడం మొదలు పెట్టాయని సెటైర్లు వేశారు. ఏ హోదాలో రాహుల్ ఇక్కడికి వచ్చారని ప్రశ్నిస్తున్నారని.. రాహుల్ గాంధీది మీలా దోపిడీ కుటుంబం కాదని అన్నారు. దేశం కోసం సర్వం త్యాగం చేయడానికి భారత్ జోడో యాత్రతో ప్రజల్లోకి వచ్చిన నాయకుడు రాహుల్ అని పేర్కొన్నారు.
"దేశంలో రాహుల్ గాంధీకి కాకుండా ఇంకెవరికి తెలంగాణలో పర్యటించే అర్హత ఉంది. మీరు అంటగాకుతున్న నరేంద్ర మోదీకి ఆ అర్హత ఉందా..? అసలు మీకున్న అర్హత ఏంటి..? ట్విట్టర్ పిట్ట, మంత్రులు రాహుల్ అర్హతపై ప్రశ్నిస్తున్నారు. భూమికి మూడు అడుగులున్నోడు కూడా రాహుల్ అర్హత గురించి మాట్లాడుతుండు. కడుపుకు అన్నం తినేవారు ఎవరూ రాహుల్ అర్హత గురించి ప్రశ్నించరు. ఎన్నో పథకాలు, ఎన్నో చట్టాలు, ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు తీసుకొచ్చింది కాంగ్రెస్. హరీష్ రావు, కేటీఆర్‌ను నేను సూటిగా ప్రశ్నిస్తున్నా.. ఇప్పటివరకు 85 వేల కోట్లు బిల్లులు చెల్లించింది నిజం కాదా..?
రాహుల్ ను విమర్శించడమంటే హరీష్, కేటీఆర్ ఒకరిపై ఒకరు కాండ్రించి ఉమ్మేసుకున్నట్లే.. మీరు దోపిడీ దొంగలు, బందిపోటు దొంగలకంటే హీనం.. నిన్నటి ఖమ్మం సభ చూసైనా బుద్ది తెచ్చుకోండి. బీఆర్‌ఎస్+బీజేపీ= బైబై. బీఆర్ఎస్ జాతీయ పార్టీ విధానం ఏమిటో చెప్పాలి. బీఆర్ఎస్ అంటేనే బీజేపీ రిస్తాజార్ సమితి అని మా నాయకుడు నిన్ననే చెప్పారు. మా విధానం ఏంటో మేం చెప్పాం.. మీ విధానం ఏంటో మీరు చెప్పండి. అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించినా రూ.4 వేల పెన్షన్‌కు కాంగ్రెస్ కట్టుబడి ఉంది. కేసీఆర్ అవినీతిని ఆపితే చాలు మొత్తం 55 లక్షల మంది పెన్షన్ దారులకు పింఛన్ ఇవ్వొచ్చు. తెలంగాణ ఇచినట్లే.. రూ.4 వేల పెన్షన్ ఇచ్చి తీరతాం.." అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
కేసీఆర్‌కు చిత్తం శివుడి మీద.. భక్తి చెప్పులపై ఉందన్నారు. రాష్ట్ర జనాభా అవసరాలు, పరిస్థితులను బట్టే పథకాలు ఉంటాయని.. రాష్ట్ర ఆదాయం ఆధారంగానే ప్రాధాన్యతలు ఉంటాయన్నారు. బెంగుళూరులో జరిగే ప్రతిపక్షాల సమావేశానికి బీఆర్ఎస్‌ను రానివ్వమని స్పష్టం చేశారు. ఒకవేళ సిగ్గులేకుండా వచ్చినా.. మెడలు పట్టి గెంటేస్తామన్నారు. కాంగ్రెస్‌ను విమర్శించే నైతిక హక్కు బీఆర్‌ఎస్‌కు లేదన్నారు.
Also Read: Jonny Bairstow Controversial Run Out: ఊహించని రీతిలో బెయిర్ స్టో రనౌట్.. ఫస్ట్ టైమ్ ఇలా..
Also Read: Telangana Politics: అవినీతికి కాంగ్రెస్ రారాజు.. అందుకే రాహుల్ గాంధీ ఓడిపోయారు: మంత్రులు ఫైర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి