Komatireddy Raj Gopal Reddy: ఎమ్మెల్సీ కవిత‌తో కలిసి రేవంత్ రెడ్డి వ్యాపార లావాదేవీలు.. కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు

Komatireddy Raj Gopal Reddy on Revanth Reddy: ఎమ్మెల్సీ కవితతో కలిసి రేవంత్ రెడ్డి వ్యాపార లావాదేవీలు చేస్తున్నారని బీజేపీ నాయకుడు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ రాజకీయ వ్యభిచారి అంటూ తీవ్రస్థాయంలో మండిపడ్డారు.  నోట్ల క‌ట్ట‌ల‌తో రెడ్ హాండెడ్‌గా దొరికి జైలుకు వెళ్లిన చరిత్ర రేవంత్‌ రెడ్డిదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Apr 22, 2023, 04:57 PM IST
Komatireddy Raj Gopal Reddy: ఎమ్మెల్సీ కవిత‌తో కలిసి రేవంత్ రెడ్డి వ్యాపార లావాదేవీలు.. కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు

Komatireddy Raj Gopal Reddy on Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి. రేవంత్‌కు బ్లాక్ మెయిలర్ అనే పేరుందని.. గత చరిత్ర ప్రజలకు తెలిసిందేనని అన్నారు. ప‌ద‌వుల‌ను అడ్డం పెట్టుకుని  బ్లాక్ మెయిల్ చేసి వేల కోట్లు దోచుకున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. భాగ్య‌ల‌క్ష్మి గుడి వ‌ద్ద ప్ర‌మాణాలంటే న‌మ్మేదెవ‌రు..? అంటూ ప్రశ్నించారు. త‌ప్పుడు ప‌నులు చేస్తున్న రేవంత్  భాగ్య‌ల‌క్షి గుడిలో అడుగు పెడితే.. ఆ దేవాల‌యం అప‌విత్రం అవుతుంద‌నేది భ‌క్తుల భావ‌న‌ అని అన్నారు. రాజ‌కీయ వ్య‌భిచారం చేసే వ్య‌క్తి త‌న స్వార్థం కోసం భాగ్య‌ల‌క్షి గుడిని కూడా వాడుకోవ‌డం భావ్యం కాదన్నారు.

తెలుగుదేశం పార్టీ ద్వారా గెలిచిన రేవంత్ రెడ్డి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్‌లో చేరిన రాజకీయ వ్యభిచారి అంటూ ఓ రేంజ్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్, తాను ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి పార్టీ మారామని.. కానీ రేవంత్ మాదిరిగా ఒక పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవితో మరో పార్టీలో చేరి రాజకీయ వ్యభిచారం చేయలేదన్నారు. కాంగ్రెస్ హైక‌మాండ్  పెద్దలకు డబ్బులు ఇచ్చి పీసీసీ అధ్యక్ష పదవిని కొనుక్కోవ‌డం ద్వారా రాజ‌కీయ వ్యభిచారానికి పాల్ప‌డింది నువ్వు కాదా అంటూ రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత‌తో కలిసి వ్యాపార లావాదేవీలు చేసింది వాస్త‌వం కాదా..? ఆమెతో నీకు వ్యాపార‌ భాగస్వామ్యం లేదా..? అని నిలదీశారు. 

'ఓటుకు నోటు కేసులో ల‌క్ష‌ల రూపాయ‌ల నోట్ల క‌ట్ట‌ల‌తో రెడ్ హాండెడ్‌గా దొరికి జైలుకు వెళ్లిన చరిత్ర రేవంత్‌ రెడ్డిది. మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి రూ.25 కోట్లు కాంగ్రెస్‌కు ముట్టాయి. అయితే అందులో ప‌ది కోట్లు రేవంత్ నొక్కేశాడని కాంగ్రెస్ నేతలే అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారు. మునుగోడులో బీజేపీ గెలిస్తే తెలంగాణ‌లో కాంగ్రెస్ ప‌త‌న‌మ‌వుతుంద‌ని.. అందుకే న‌న్ను ఓడించేందుకు బీఆర్ఎస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ పార్టీని గెలిపించ‌డం రాజ‌కీయ వ్య‌భిచారం కాదా రేవంత్..?' అంటూ రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు.

Also Read: Karnataka Elections: సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు హ్యాండిచ్చిన బీజేపీ.. అసలు కారణం చెప్పిన అమిత్ షా  

తననును రాజ‌కీయంగా ఎదుర్కోలేక‌.. మునుగోడులో ఓడించేందుకు ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేశారని అన్నారు. రూ.18 వేల కోట్ల‌కు అమ్ముడు పోయానంటూ బీఆర్ఎస్‌తో క‌లిసి దుష్ప్ర‌చారం చేయ‌డం రాజ‌కీయ వ్యభిచారం కాదా..? అని అడిగారు. పార‌ద‌ర్శకంగా జ‌రిగిన‌ గ్లోబల్ కాంపిటీటివ్ బిడ్డింగ్‌లో టెండర్ దక్కితే.. ఆ నిజాన్ని దాచి అమ్ముడు పోయానంటూ తప్పుడు ఆరోపణ చేశారని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి దగ్గర ఆధారాలుంటే ఎందుకు రుజువు చేయ‌డం లేదన్నారు. తనపై చేసిన ఆరోప‌ణ‌ల‌ను రుజువు చేయ‌క‌పోతే రేవంత్‌ రెడ్డిని వ‌దిలే ప్ర‌సక్తే లేదని హెచ్చరించారు. రాజ‌కీయంగా రేవంత్‌ను వేటాడుతానని.. కోర్టు ద్వారా కూడా సంగ‌తి తేలుస్తానని స్పష్టం చేశారు. తాను దాఖలు వేయనున్న ప‌రువు న‌ష్టం కేసులో ఎప్ప‌టికైనా రేవంత్  జైలుకు వెళ్ల‌డం ఖాయన్నారు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి.

Also Read: Repo Rate 2023: లోన్లు తీసుకున్న వారికి గుడ్‌న్యూస్.. త్వరలో వడ్డీ రేట్లు తగ్గింపు..!   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News