Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం

TPCC Chief Revanth Reddy : ఇటీవల తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమితులైన రేవంత్ రెడ్డి బుధవారం నాడు హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఉత్తమ్ కుమార్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 7, 2021, 04:23 PM IST
  • హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఉత్తమ్ కుమార్ నుంచి రేవంత్ రెడ్డి బాధ్యతలు
  • నేటి ఉదయం జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ గుడిలో రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు
  • రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు
Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం

Revanth Reddy takes charge as TPCC chief: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఇటీవల తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC Chief Revanth Reddy) అధ్యక్షుడిగా నియమితులైన రేవంత్ రెడ్డి బుధవారం నాడు హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఉత్తమ్ కుమార్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది.

నేటి ఉదయం జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ గుడిలో రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఆపై నాంపల్లి దర్గాకు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలతో భారీ ర్యాలీగా వెళ్లిన రేవంత్ రెడ్డి అక్కడ చాదర్ సమర్పించారు. దర్గా నుంచి గాంధీ భవన్ చేరుకున్న రేవంత్ రెడ్డి (Revanth Reddy), ఉత్తమ్ కుమార్ నుంచి టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, గీతారెడ్డి, దామోదర రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ కొత్త కార్యవర్గ సభ్యులు, పార్టీకి చెందిన మరికొందరు ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్తమ్ నుంచి బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను మరోసారి అధికారంలోకి తెచ్చేలా రేవంత్ పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read: TPCC Chief రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే Danam Nagender ఫైర్, చివరిశ్వాస వరకు కేసీఆర్‌తోనని స్పష్టం

టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టడానికి కొన్ని రోజుల ముందునుంచి తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలైన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మర్రి శశిధర్ రెడ్డి, జగ్గారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి కీలక నేతలతో భేటీ అయ్యారు. ఇటీవల రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్‌గా ప్రకటించిన సందర్భంగా ఢిల్లీకి ఎవరూ రావొద్దని, అసంతృప్తి వ్యక్తం చేయకుండా పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించాలని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సూచించినట్లు సమాచారం. టీపీసీసీ చీఫ్ పదవి రాకపోవడంతో నిరాశ చెందిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాత్రం తన అసహనాన్ని వ్యక్తం చేయడం తెలిసిందే.

Also Read: Telangana Rains: తెలంగాణలో నేటి నుంచి రెండు రోజులపాటు వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News