Teenmar Mallanna Exclusive Interview: తీన్మార్ మల్లన్న... తెలంగాణలో పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవలె బీజేపిలో చేరిన తీన్మార్ మల్లన్నకు అంతకంటే ముందు కాంగ్రెస్ నుంచి ఆహ్వానం అందలేదా ? టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో టచ్‌లో ఉన్నాను అని చెబుతున్న తీన్మార్ మల్లన్న మాటల్లో ఆంతర్యమేంటి ? 2023 ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీచేస్తారా ? చేస్తే ఎక్కడి నుంచి బరిలో నిలబడతారు ? తీన్మార్ మల్లన్న బ్లాక్ మెయిలరా ? ఇవే కాదు.. ఇలాంటి ఇంకెన్నో సందేహాలకు స్వయంగా తీన్మార్ మల్లన్న నోటే సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు జీ తెలుగు న్యూస్ డిజిటల్ టీవీ ఎడిటర్ భరత్.
Zee Telugu News Interview with Harish Rao: తెలంగాణ ఉద్యమ సమయంలో ఎలా పని చేశామో, ఇప్పుడు అదే స్ఫూర్తితో పని చేస్తున్నామంటోన్న మంత్రి హరీశ్... తెలంగాణకు సంబంధించిన పలు విషయాలపై మాట్లాడారు. మంత్రి హరీశ్ రావుతో జీ తెలుగు న్యూస్ .. స్పెషల్ ఇంటర్వ్యూపై ఓ లుక్కేయండి.
JP Nadda Rally: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ పర్యటనతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తాజాగా శంషాబాద్ చేరుకున్న నడ్డాకు పలువురు రాష్ట్ర బీజేపీ నాయకులు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ఒకవైపు కోవిడ్ నిబంధనలు, మరోవైపు బీజేపీ క్యాండిల్ ర్యాలీ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో బీజేపీ ర్యాలీకి అనుమతిలేదని అధికారికంగా పోలీసులు ప్రకటించారు.
YS Sharmila comments On Telangana CM KCR: ప్రత్యేక రాష్ట్రం అంశాన్ని యూపీఏ మేనిఫెస్టోలో చేర్చిన ఘనత వైఎస్సార్ సొంతమన్నారు. కానీ వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణలో పరిస్థితులు లేవని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు.
Congress MLA Komati Reddy Rajgopal Reddy : సోదరుడు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వకపోవడంతో పార్టీ మారే ఉద్దేశం ఉందా అనే ఊహాగానాలు కొనసాగుతున్నాయి. పార్టీ మారడం అంశంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టత ఇచ్చారు.
TPCC Chief Revanth Reddy : ఇటీవల తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమితులైన రేవంత్ రెడ్డి బుధవారం నాడు హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఉత్తమ్ కుమార్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది.
Gangula Kamalakar vs Eatala Rajender: ఈటల ఆరోపణలు, విమర్శలకు మంత్రి గంగుల కమలాకర్ వెంటనే కౌంటర్ అటాక్ ఇచ్చారు. తాను కూడా బీసీ బిడ్డనేనంటూ గంగుల మీసం మెలి వేయడం గమనార్హం. మరోసారి బిడ్డ అనే పదం వాడితే మంచిగా ఉండదు, జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించారు.
Konda Vishweshwar Reddy meets Eetela Rajender: మేడ్చల్: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వెళ్లి కలవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. మేడ్చల్‌లోని ఈటల రాజేందర్ నివాసానికి వెళ్లిన విశ్వేశ్వర్ రెడ్డి అక్కడ ఈటలతో భేటీ అయి ప్రస్తుత పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు.
Nagarjuna Sagar Assembly By-Election: ఆఖరిరోజు వరకు ఎదురుచూసిన అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులతో నామినేషన్లు వేయించారు. నాగార్జున సాగర్ దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్‌కు సీఎం కేసీఆర్ సీటు ఖరారు చేయడం తెలిసిందే.
Telangana MLC Elections 2021 Results Live Updates: మహబూబ్‌నగర్ - హైదరాబాద్ - రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఏ అభ్యర్థికి తొలి ప్రాధాన్యత ఓట్లలో స్పష్టమైన మెజార్టీ రాలేదు. ప్రస్తుతం ఎన్నికల అధికారులు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు.
Telangana MLC Elections 2021 Votes Counting : మార్చి 14వ తేదీన జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభించారు. తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది.
తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతుంది. హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్‌నగర్, నల్లగొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు నేటి (మార్చి 14న) ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. భారీ సైజు బ్యాలెట్ పేపర్లు, జంబో బ్యాలెట్ బాక్స్‌లను ఉపయోగిస్తున్న ఈ పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ నిర్వహించనున్నారు.
TPCC Chief Uttam Kumar Reddy | ప్రస్తుతం బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, ఇతర పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఓటర్లను బెదిరించి ఓటు వేయాలని ప్రమాణం చేయిస్తూ రాజకీయాలు చేయిస్తున్నారని టీఆర్ఎస్ నేతలపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana Congress Leader Kuna Srisailam Goud: తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు షాకుల మీద షాకులు ఇస్తున్నారు ఆ పార్టీ నేతలు, ఇదివరకే కొందరు పార్టీ ఫిరాయించారు. తాజాగా మరో కీలక నేత కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు.
సామాజిక మాధ్యమాల్లో తనపై శృతి మించి జరుగుతున్న ప్రచారం, వదంతులు అనేక అపోహలకు దారితీస్తున్నందున తాను ఆ ప్రచారాన్ని ఖండిస్తూ ఈ వివరణ ఇస్తున్నట్లు ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు.
నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ఆఫీసులో జరిగిన "నియంత్రిత సాగు" విధానంపై నల్గొండ నియోజకవర్గస్థాయి కార్యాచరణ ప్రణాళిక సన్నాహక సమావేశం రసాభాసగా మారింది. ఈ సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి ( Minister Jagadish Reddy ) , టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిల ( TPCC chief MP Uttamkumar Reddy ) మధ్య అనుకోకుండా మొదలైన మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.