దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు చూసిన వారంతా టీఆర్ఎస్ పనైపోయిందన్నారు. పట్టభద్రలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారికి ఓటమి తప్పదని ప్రతిపక్షాలు కామెంట్ చేశాయి. కానీ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లోనూ అధికార టీఆర్ఎస్ విజయం సాధించింది.
హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్‌నగర్, నల్లగొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు నిర్వహించిన ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. తొలుత దివంగత ప్రధాని పీవీ నరసింహారావు కూతురు సురభి వాణీదేవి(Surabhi VaniDevi) విజయం సాధించారు. ఆపై నల్లగొండ - ఖమ్మం - వరంగల్ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం తథ్యమైంది. ఎన్నికలకు ముందు 29 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ సానుకూలత వ్యక్తం చేశారని చెప్పడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు కొంతమేర శాంతించాయి. తమ వ్యతిరేకత తగ్గి, ఓట్లుగా మారాయి. మరోవైపు ఓట్ల చీలిక సైతం టీఆర్ఎస్‌కు కలిసొచ్చింది.
Also Read: Mlc Election Results: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి సురభి వాణిదేవి విజయం
హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్‌నగర్ సిట్టింగ్ స్థానాన్ని బీజేపీ కోల్పోయింది. వాణీదేవిని చివరి నిమిషంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన కేసీఆర్ వ్యూహం ఫలించింది. అయితే టీఆర్ఎస్ గెలవని చోట వాణీదేవిని బరిలో నిలిపి ఆమెను బలిపశువును చేశారంటే కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీలు విమర్శించాయి. కానీ సీఎం కేసీఆర్ ఇవేమీ పట్టించుకోలేదు. బహుముఖ వ్యూహాలు అనుసరిస్తూ ఓట్ల చీలిక తీసుకొచ్చి సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచందర్ రావుపై టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి విజయం సాధించేలా చేశారు. ఈ స్థానంలో 2009 మినహా 2007, 2009, 2015లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమిపాలైంది.
‘నల్లగొండ’ స్థానంలో మరోసారి పల్లా..
నల్లగొండ - ఖమ్మం - వరంగల్ స్థానంలో ఆదినుంచి టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధిక్యాన్ని ప్రదర్శించారు. తొలి ప్రాధాన్యతలో విజయానికి కావాల్సిన మెజార్టీ ఎవరికీ రాని పక్షంలో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించి తీన్మార్ మల్లన్న(Teenmaar Mallanna)పై టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించి సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకున్నారు. గత ఆరు నెలలుగా దీనిపై సీఎం కేసీఆర్ కసరత్తు చేశారు. ఉమ్మడి జిల్లా మంత్రులు సన్నాహక సమావేశాలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, డాక్టర్లు.. కొన్ని ఇతర ఉద్యోగ సంఘాలకు ప్రాధాన్యమిచ్చి తన విజయానికి టీఆర్ఎస్ బాటలు వేసుకుంది.
Also Read: EPFO Good News: జాబ్ మానేశాక EPF ఖాతా నుంచి నగదు డ్రా చేయవద్దు, ఆ కారణాలు మీకోసం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Telangana MLC Election Results: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 స్థానాల్లోనూ TRS విజయం
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లోనూ అధికార టీఆర్ఎస్ విజయం
మాజీ ప్రధాని పీవీ కూతురు సురభి వాణీదేవి, పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయబావుటా
ప్రతిపక్షాలకు తమ విజయంతో సమాధానం చెప్పిన తెలంగాన సీఎం కేసీఆర్