నల్లగొండ : జిల్లా కలెక్టరేట్ ఆఫీసులో జరిగిన "నియంత్రిత సాగు" విధానంపై నల్గొండ నియోజకవర్గస్థాయి కార్యాచరణ ప్రణాళిక సన్నాహక సమావేశం రసాభాసగా మారింది. ఈ సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి ( Minister Jagadish Reddy ) , టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిల ( TPCC chief MP Uttamkumar Reddy ) మధ్య అనుకోకుండా మొదలైన మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. స్టేజీపై మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతుండగా.. మధ్యలో అడ్డంవచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. రుణ మాఫీ ( Loan waiver ) విషయంలో మీరు చేసిందేమీ లేదంటూ మంత్రిని నీలదీసే ప్రయత్నం చేశారు. దీంతో స్టేజ్ మీదే ఇరువురి మధ్య వాగ్వీవాదం చోటుచేసుకుంది. మీరు మాట్లాడేటప్పుడు తాను మధ్య అడ్డం రాలేదని... నేను మాట్లాడేటప్పుడు మీరు మాత్రం ఎందుకు మధ్యలో అడ్డం వస్తున్నారని ఉత్తమ్‌పై మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. డిబేట్స్ పెట్టుకోవడానికి ఇదేమీ అసెంబ్లీ లేక పార్లమెంట్ కాదని ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. ( GRMB, KRMB: తెలంగాణ సర్కారుకి గోదావరి, క్రిష్ణా రివర్ బోర్డులు షాక్ )
అయితే, మంత్రి జగదీష్ రెడ్డి గట్టిగా మాట్లాడంపై అభ్యంతరం వ్యక్తంచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి... గొంతు పెంచొద్దని అన్నారు. దీంతో ఒకనొక దశలో సహనం కోల్పోయిన మంత్రి జగదీష్ రెడ్డి.. '' ఆఫ్ట్రాల్ నీ లెక్కేంది'' అంటూ ఉత్తమ్‌పై మండిపడ్డారు. అయితే, ఆఫ్ట్రాల్ నీ లెక్కేంది అంటూ మంత్రి జగదీష్ రెడ్డి తనను కామెంట్ చేయడంపై ఆగ్రహానికి గురైన ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం అదే స్థాయిలో ప్రతిఘటిస్తూ.. '' మరి నీ లెక్కేంది'' అని అడిగారు. ఇలా సమావేశం మధ్యలోనే ఇరువురు నేతలు ఒకరిపై మరొకరు వాగ్వీవాదానికి దిగిన తీరు చర్చనియాంశమైంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Watch video: నీ లెక్కెంతంటే.. నీలెక్కెంత అంటూ వాగ్వీవాదానికి దిగిన నేతలు