Telangana MLC Elections 2021 Results: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 స్థానాల్లోనూ ఆధిక్యంలో TRS అభ్యర్థులు

Telangana MLC Elections 2021 Results Live Updates:

Written by - Shankar Dukanam | Last Updated : Mar 18, 2021, 04:44 PM IST
  • తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
  • కౌంటింగ్ ఫలితాలలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఆధిక్యంలో కొనసాగుతోంది
  • మొత్తం మూడు రౌండ్లలో 9,252 చెల్లని ఓట్లు పోలయ్యాయి
Telangana MLC Elections 2021 Results: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 స్థానాల్లోనూ ఆధిక్యంలో TRS అభ్యర్థులు

Telangana MLC Elections 2021 Results Live Updates: తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురువారం సైతం కొనసాగుతోంది. మార్చి 14వ తేదీన జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభించారు. అయితే తొలి, రెండో రౌండ్ కౌంటింగ్ ఫలితాలలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి(TRS) ఆధిక్యంలో కొనసాగుతోంది.

నల్గొండ - ఖమ్మం - వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం రెండో రౌండ్ ఫలితాలను నేటి ఉదయం అధికారులు ప్రకటించారు. Telangana MLC Elections 2021 మొదటి రౌండ్‌లో మొత్తం ఓట్లు 55991ను లెక్కించగా అందులో చెల్లని ఓట్లు 3009 ఉండగా, చెల్లుబాటు అయిన ఓట్లు 52982 ఉన్నాయని తెలిపారు. రెండో రౌండ్ ‌లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి 15857 ఓట్లు, తీన్మార్ మల్లన్నకు 12070 ఓట్లు, టీజేఎస్ అభ్యర్థి, ప్రొఫెసర్ కోదండరాంకు 9448 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 6669 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థికి 3244 ఓట్లు వచ్చాయి.

Also Read: Telangana MLC Elections 2021: తెలంగాణలో కొనసాగుతున్న 2 ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు‌

రెండో రౌండ్ ఫలితాల అనంతరం పల్లా రాజేశ్వర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి తీన్మార్ మల్లన్న కన్నా 3,787 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి కన్నా ప్రొఫెసర్ కోదంరామ్ అధికంగా ఓట్లు సాధించారు. కీలక నేతలలో కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్ 5వ స్థానానికి పరిమితమయ్యారు. వరంగల్ - ఖమ్మం - నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు నల్లగొండలోని మార్కెట్ గిడ్డంగిలో కొనసాగుతోంది.

Also Read: 7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు DA Hike మరియు డీఆర్ చెల్లింపులపై కీలక నిర్ణయం

టీఆర్ఎస్‌దే ఆధిక్యం..
హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు మొదటి రౌండ్ పూర్తయింది. అధికార టీఆర్ఎస్ 1054 ఓట్ల ఆధిక్యం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీకి 17,439 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రామచందర్ రావుకు 16385 ఓట్లు పోలయ్యాయి. ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు 8357 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి జి చిన్నారెడ్డికి 5101 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ మొత్తం 3,57,354 ఓట్లు పోలయ్యాయి.

Also Read: Today Horoscope: నేటి రాశి ఫలాలు మార్చి 18, 2021 Rasi Phalalu, ఓ రాశివారికి వాహనయోగం 

మహబూబ్‌నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు: మూడు రౌండ్లలో భారీగా చెల్లని ఓట్లు. ప్రతీ రౌండ్‌లో 3 వేల పైచిలుకు చెల్లని ఓట్లే పోలయ్యాయి. మొత్తం మూడు రౌండ్లలో 9,252 చెల్లని ఓట్లు పోలయ్యాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Trending News