Singareni Job Fair: తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగ ప్రకటనలు ఊరిస్తున్నాయి. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించినా ఇంకా ఉద్యోగ ప్రకటనలు విడుదల కావడం లేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే పోలీస్, గ్రూప్ 1 ఉద్యోగ ప్రకటనలు వేస్తామని ప్రకటించారు.
BRS MLC Kalvakuntla Kavitha about Singareni: హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సింగరేణి సంస్థకి ప్రక్షపాతి అని, అందుకే సింగరేణి ఉద్యోగులు, కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.
Singareni Privatization : కరీంనగర్ జైల్ నుంచి విడుదలైన బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. సింగరేణి ప్రైవేటీకరణ గురించి మాట్లాడాడు. కేంద్రం ఆ పని చేయలేదని, చేస్తే రాష్ట్ర ప్రభుత్వమే చేయాలని అన్నాడు.
KTR On Auctioning Of Singareni Coal Mines: సింగరేణి బొగ్గు గనులను వేలం వేస్తున్నట్లు కేంద్ర మంత్రి చేసిన ప్రకటనపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణపై కేంద్రం కక్ష కట్టిందని.. సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటుపరం చేసే ప్రయత్నాలను మోదీ ప్రభుత్వం ముమ్మరం చేసిందని మండిపడ్డారు.
Telangana: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సింగరేణి కార్మికులు ధర్నా నిర్వహించారు. పెంచిన వేతనాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా చేశారు.
Singareni Results: సింగరేణిలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్ధులకు శుభవార్త. సింగరేణి జూనియర్ అసిస్టెంట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలు ఇలా చెక్ చేసుకోవాలి
Coal Production Stopped In Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దానికి సంబందించిన వీడియో చూద్దాం.
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెకు దిగారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ కొత్తగూడెంలోని సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదుట నిరసనకు దిగారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతనాలు పెంచాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. సింగరేణి పరిధిలోని 11 ఏరియాల్లో మొత్తం 28 వేల మంది కార్మికులు శుక్రవారం నుంచి నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నారు.
Killer Wife: మంచిర్యాల జిల్లా గోదావరి ఖనిలో యువకుడిని గన్ తో కాల్చి చంపిన కేసును పోలీసులు చేధించారు. హత్య జరిగిన కొన్ని గంటల్లోనే హంతకులను పట్టుకున్నారు పోలీసులు. మంచిర్యాల జిల్లాలో కలకలం స్పష్టించిన యువకుడు రాజేందర్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి.
Bandi Sanjay Comments: తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య వార్ కొనసాగుతోంది. ఇరుపార్టీల నేతలు పరస్పరం విమర్శించుకుంటున్నారు. మోదీ 8 ఏళ్ల పాలనపై అధికార పార్టీ పెదవి విరుస్తోంది. ఇటు తెలంగాణ ప్రభుత్వ అవినీతిపై బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు.
MLC Kavitha: జాతీయ రాజకీయాలపై కొన్ని రోజులుగా హాట్ కామెంట్స్ చేస్తున్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను సోషల్ మీడియా వేదికగా ఆమె టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల తెలంగాణలో పర్యటించిన రాహుల్ గాంధీ, జేపీ నడ్డా, అమిత్ షాలకు పలు ప్రశ్నలు సంధించారు.
Singareni Coal Mine Accident: సింగరేణిలో వరుస ప్రమాదాలు కార్మికుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. వారం క్రితం శ్రీరాంపూర్ డివిజన్లో జరిగిన ప్రమాద ఘటన మరవకముందే మందమర్రి పరిధిలోని కల్యాణిఖని బొగ్గు గనిలో మరో ప్రమాదం చోటు చేసుకుంది.
Singareni coal mine accident: శ్రీరాంపూర్ డివిజన్లోని ఎస్ఆర్పీ 3 బొగ్గు గనిలో పైకప్పు కూలి నలుగురు కార్మికులు మృతి చెందారు. మొదటి షిఫ్ట్‌లో ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం గని వద్ద భారీ పోలీస్ భద్రత (Police protection) ఏర్పాటు చేసినట్లు సమాచారం.
Dasara bonus for Singareni employees: హైదరాబాద్ : సింగరేణి కార్మికులకు తెలంగాణ సీఎం కేసీఆర్ దసరా బోనస్ రూపంలో గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఏడాది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆర్జించిన లాభాల్లోంచి 29 శాతం వాటాను కార్మికులకు బోనస్‌గా ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
Singareni Recruitment 2021: How To Apply For Singareni Jobs: ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ నిరుద్యోగులకు సింగరేణి కాలరీస్ శుభవార్త అందించింది. మొత్తం 651 ఖాళీలు ఉండగా.. ప్రస్తుతం తొలి విడత నోటిఫికేషన్లో 372 ట్రైనీ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు సింగరేణి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ తెలిపారు.
సింగరేణి (Singareni Blast) లో జరిగిన ప్రమాదంపై కేంద్ర మంత్రులకు పిర్యాదు చేస్తానని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) తెలిపారు. రామగుండం సింగరేణి ఓపెన్ కాస్ట్ గనిలో భారీ పేలుడు సంభవించి నలుగురు కాంట్రాక్ట్ కార్మికులు చనిపోవడం తెలిసిందే.
సింగరేణి ప్రాంతంలో చేపట్టిన, చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం శ్రీ కేసీఆర్ నేడు సమీక్ష చేపట్టారు. ప్రగతిభవన్‌లో జరిగినే ఈ భేటీకి సింగరేణి సీఎండీ శ్రీధర్, ప్రజా ప్రతినిధులు, ఇతర అధికారులు హాజరయ్యారు.
సింగరేణి కార్మికులతో ప్రగతిభవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమై అనేక అంశాల మీద చర్చించారు. వారి ఇంటి నిర్మణాలకు 10 లక్షల వరకు వడ్డీ లేని రుణం అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. తొలుత టీబీజీకేఎస్‌ను గెలిపించినందుకు ధన్యవాదాలు తెలియజేసిన ముఖ్యమంత్రి, గతంలో తమ సొసైటీ అధికారంలోకి వచ్చినా పనులు ఆశించినంత రీతిలో జరగలేదని, కానీ ప్రస్తుతం సింగరేణి కార్మికుల సమస్యలను తొలిగించడానికి తాను సంసిద్ధంగా ఉన్నానని..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.