Parkash Singh Badal's Death News: 1995 నుంచి 2008 వరకు శిరోమణి అకాలి దళ్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసిన ప్రకాశ్ సింగ్ బాదల్.. 1970 నుంచి 2017 మధ్య కాలంలో ఐదుసార్లు పంజాబ్ ముఖ్యమంత్రిగా సేవలు అందించారు.
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బూటా సింగ్ (Buta Singh) (86) కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బూటా సింగ్ శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో పలు సంఘాల ఆధ్వర్యంలో రైతులు పెద్ద ఎత్తున (Farmer protests) ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గురువారంతో రైతుల నిరసన ఎనిమిదో రోజుకు చేరింది. ఈ ఆందోళనలో ఎక్కువగా పంజాబ్ రైతులు ఉన్నారు.
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis), శివసేన కీలక నేత, ఎంపీ, సంజయ్ రౌత్ ( Sanjay Raut ) శనివారం ముంబైలోని ఓ లగ్జరీ హోటల్లో భేటీ అయ్యారన్న విషయం తెలియగానే రాజకీయ వర్గాల్లో అలజడి మొదలైంది. బీజేపీతో బంధం తెగిపోయిన నాటినుంచి ఎప్పుడూ శివసేన బీజేపీపై విరుచుకుపడుతూనే ఉంది. అయితే వారిద్దరి భేటీపై సర్వత్రా చర్చనీయాంశమైంది.
బీజేపీ (BJP) కి చిరకాల మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్ షాక్ ఇచ్చింది. అధికార పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) నుంచి తప్పుకుంటున్నట్లు అకాలీదళ్ (SHIROMANI AKALI DAL) ప్రకటించింది. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు కొన్ని రోజుల నుంచి గళం వినిపిస్తున్నారు. ఆ బిల్లులను నిరసిస్తూ.. అకాలీదళ్ పార్టీ ఎంపీ హర్సిమ్రత్ కౌర్ బాదల్ (Harsimrat Kaur Badal) కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
ఎన్డీఏ (NDA) ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ బిల్లుల (agriculture bill) ను అందరూ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బిల్లులు తీసుకురావడాన్ని నిరసిస్తూ ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ శిరోమణి అకాలీదళ్ పార్టీ సభ్యురాలు హర్సిమ్రత్ కౌర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా సైతం చేశారు. పలు వ్యవసాయ సంఘాలు రైల్ రోకోకు, బంద్కు పిలుపునిచ్చాయి. రేపు ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం.
పార్లమెంటులో ఎన్డీయే సర్కారు ప్రవేశపెట్టిన వ్యవసాయ సంబంధిత బిల్లును వ్యతిరేకిస్తూ.. ప్రభుత్వ భాగస్వామ్య శిరోమణి అకాలీదళ్ పార్టీ నాయకురాలు, కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ (Harsimrat Kaur Badal) రాజీనామా చేశారు. సెంట్రల్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మంత్రిగా బాధ్యతలను నిర్వర్తిస్తున్న ఆమె గురువారం రాత్రి రాజీనామా చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.