SAD breaks ties with BJP-led NDA over farm bills: చండీగఢ్: బీజేపీ (BJP) కి చిరకాల మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్ షాక్ ఇచ్చింది. అధికార పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) నుంచి తప్పుకుంటున్నట్లు అకాలీదళ్ (SHIROMANI AKALI DAL) ప్రకటించింది. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు కొన్ని రోజుల నుంచి గళం వినిపిస్తున్నారు. ఆ బిల్లులను నిరసిస్తూ.. అకాలీదళ్ పార్టీ ఎంపీ హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ (Harsimrat Kaur Badal) కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతరం పంజాబ్‌లో మూడురోజుల నుంచి రైతులు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ తీవ్రమైన ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం రాత్రి జరిగిన శిరోమణి అకాలీదళ్ నేతల అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కూటమి నుంచి వైదొలుగుతున్నట్టు ఆపార్టీ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌సింగ్ బాదల్ (Sukhbir Singh Badal) వెల్లడించారు. Also read: Devendra Fadnavis, Sanjay Raut: హోటల్లో ఫడ్నవిస్, సంజయ్ రౌత్ భేటీ
రైతుల మనోభావాలను గౌరవించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలం అయిందని, ఇప్పుడు తీసుకువచ్చిన బిల్లు రైతులకు హాని కలిగించేవని బాదల్ పేర్కొన్నారు. వ్యవసాయ బిల్లులు, పంటలకు కనీస మద్దతు ధరలపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయలేదని ఆయన స్పష్టంచేశారు. పంజాబ్ (Punjab) వాసులు, సిక్కుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం అలసత్వం వహించిందని అంతేకాకుండా పంజాబీ భాషను జమ్ముకశ్మీర్‌లో అధికార భాష హోదా నుంచి తొలగించడం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఎన్డీఏ కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే.. పార్టీ నేతలను, కార్యకర్తలను, రైతులను సంప్రదించిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుఖ్‌బీర్‌సింగ్ బాదల్ స్పష్టంచేశారు. Also read: CoronaVirus Vaccine: సింగిల్ డోస్‌తో కరోనా వైరస్ అంతం!
అయితే అంతకుముందు ఎన్డీఏ (National Democratic Alliance) కూటమి నుంచి శివసేన (shiv sena), టీడీపీ (TDP)కూడా బయటకు వచ్చాయి. అయితే బీహార్ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత.. వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ శిరోమణి అకాలీదళ్ (Akali Dal) కూడా ఎన్డీఏ నుంచి బయటకు రావడంతో.. ప్ర్తస్తుతం చర్చనీయాంశంగా మారింది. Corona Antibody వచ్చేసింది, ఇక వ్యాక్సిన్ పై తొందరపాటు అవసరం లేదు!
Shiromani Akali Dal: ఎన్డీఏ నుంచి వైదొలిగిన అకాలీదళ్