Sanjay Raut Clarified Meeting With Devendra Fadnavis: ఢిల్లీ: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis), శివసేన కీలక నేత, ఎంపీ, సంజయ్ రౌత్ ( Sanjay Raut ) శనివారం ముంబైలోని ఓ లగ్జరీ హోటల్లో భేటీ అయ్యారన్న విషయం తెలియగానే రాజకీయ వర్గాల్లో అలజడి మొదలైంది. బీజేపీతో బంధం తెగిపోయిన నాటినుంచి ఎప్పుడూ శివసేన బీజేపీపై విరుచుకుపడుతూనే ఉంది. అయితే వారిద్దరి భేటీపై సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే ఫడ్నవీస్‌తో భేటీ గురించి శివసేన ఎంపీ, సామ్నా పత్రిక సంపాదకుడు సంజయ్ రౌత్ క్లారిటీ ఇస్తూనే.. ఎన్డీఏపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని విషయాల గురించి చర్చించడానికి నిన్న దేవేంద్ర ఫడ్నవిస్‌తో భేటి అయినట్లు సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ఫడ్నవిస్ మహారాష్ట్ర మాజీ సీఎం, అలాగే ప్రతిపక్ష నాయకుడు.. బీజేపీ బీహార్ ఎన్నికల ఇన్చార్జ్ అని ఆయన్ను కలవడం తప్పేంటని పేర్కొన్నారు. సైద్ధాంతిక భేదాలు ఉన్నప్పటికీ తాము శత్రువులు కాదని పేర్కొన్నారు. దీంతోపాటు.. ఈ సమావేశం గురించి సీఎం ఉద్దవ్ ఠాక్రే (Uddhav Thackeray) కు తెలుసంటూ సంజయ్ రౌత్ సమాధానమిచ్చారు. ఇద్దరం పాత మిత్రులమని.. సామ్నా పత్రికలో ఇంటర్వ్యూ కోసం సమావేశమైనట్లు రౌత్ స్పష్టంచేశారు. అంతేకాకుండా ఎప్పటిలాగానే సంజయ్ రౌత్ ఎన్డీఏపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. Also read: Devendra Fadnavis, Sanjay Raut: హోటల్లో ఫడ్నవిస్, సంజయ్ రౌత్ భేటీ
NDA के मजबूत स्तंभ शिवसेना और अकाली दल थे। शिवसेना को मजबूरन NDA से बाहर निकलना पड़ा, अब अकाली दल निकल गया। NDA को अब नए साथी मिल गए हैं, मैं उनको शुभकामनाएं देता हूं। जिस गठबंधन में शिवसेना और अकाली दल नहीं हैं मैं उसको NDA नहीं मानता: संजय राउत, शिवसेना pic.twitter.com/nVhtbRwRfv
— ANI_HindiNews (@AHindinews) September 27, 2020
ఎన్డీయే (National Democratic Alliance) మూలస్తంభాలు శివసేన, శిరోమణి అకాలీదళ్ ( Shiromani Akali Dal) అని ఆయన పేర్కొన్నారు. అయితే ఎన్డీఏ నుంచి శివసేన ఎప్పుడో బయటకు వచ్చిందని.. ఇప్పుడు అకాలీదళ్ వైదొలిగిందని ఆయన సంజయ్ రౌత్ తెలిపారు. అయితే ఇప్పుడు ఎన్డీఏ (NDA) తో కొత్త భాగస్వాములు జతకట్టారు.. వారందరికీ శుభాకాంక్షలు. శివసేన, అకాలీదళ్ లేని కూటమిని ఎన్డీఏగా పరిగణించను అంటూ సంజయ్ రౌత్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. Also read:Bihar polls: ముంబై నుంచి బీహార్‌కు సమస్యలు పార్శిల్: శివసేన నేత సంజయ్ రౌత్