Former Punjab CM Parkash Singh Badal returns Padma Vibhushan: న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులను ( Farm Bills ) రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో పలు సంఘాల ఆధ్వర్యంలో రైతులు పెద్ద ఎత్తున (Farmer protests) ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గురువారంతో రైతుల నిరసన ఎనిమిదో రోజుకు చేరింది. ఈ ఆందోళనలో ఎక్కువగా పంజాబ్ రైతులు ఉన్నారు. ఈ క్రమంలో రైతుల డిమాండ్లను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం తీరు పట్ల పంజాబ్ మాజీ సీఎం, శిరోమణి అకాళీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్ ( Parkash Singh Badal ) కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన తెలుపుతున్న రైతులకు మద్దతుగా పద్మ విభూషణ్ (Padma Vibhushan) అవార్డును ప్రభుత్వానికి తిరిగి ఇవ్వనున్నట్లు ప్రకాశ్ సింగ్ బాదల్ గురువారం మధ్యాహ్నం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని, దానికి నిరసనగా పద్మ విభూషణ్ అవార్డును ప్రభుత్వానికి తిరిగి ఇవ్వనున్నట్లు ప్రకాశ్ సింగ్ బాదల్ పేర్కొన్నారు. Also Read| Farmer protests: నేడు మరోసారి కేంద్రంతో రైతుల చర్చలు
మాజీ సీఎం బాటలోనే.. ఎంపీ..
పంజాబ్ మాజీ సీఎంతోపాటు.. శిరోమణి అకాలీదళ్ (డెమొక్రాటిక్) చీఫ్, రాజ్యసభ ఎంపీ సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సా ( MP Sukhdev Singh Dhindsa) కూడా పద్మ భూషణ్ ( Padma Bhushan ) అవార్డును తిరిగి ఇస్తున్నట్లు గురువారం మధ్యహ్నం ప్రకటించారు. ఈ మేరకు ఆయన కార్యాలయం ప్రకటనను విడుదల చేసింది.
Shiromani Akali Dal (Democratic) chief and Rajya Sabha MP Sukhdev Singh Dhindsa (file photo) announces to return Padma Bhushan award in protest against farm laws, his office says pic.twitter.com/w6Gcq72lzP
— ANI (@ANI) December 3, 2020
ఇదిలాఉంటే.. మంగళవారం కేంద్ర ప్రభుత్వం.. రైతు సంఘాల ప్రతినిధులతో (Farmers Organizations).. జరిపిన చర్చలు విఫలం అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు తాజాగా మరోసారి కేంద్రానికి, రైతులకు మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. Also read: Rajinikanth: జనవరిలో తలైవా రాజకీయ అరంగ్రేటం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Farmer protests: పద్మవిభూషణ్‌ను వెనక్కిచ్చిన పంజాబ్ మాజీ సీఎం
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో పలు సంఘాల ఆధ్వర్యంలో రైతులు పెద్ద ఎత్తున (Farmer protests) ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
నిరసన తెలుపుతున్న రైతులకు మద్దతుగా పద్మ విభూషణ్ (Padma Vibhushan) అవార్డును ప్రభుత్వానికి తిరిగి ఇవ్వనున్నట్లు ప్రకాశ్ సింగ్ బాదల్ గురువారం మధ్యాహ్నం ప్రకటించారు.