ఎన్డీఏ (NDA) ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ బిల్లుల (agriculture bill) ను అందరూ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బిల్లులు తీసుకురావడాన్ని నిరసిస్తూ ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ శిరోమణి అకాలీదళ్ పార్టీ సభ్యురాలు హర్సిమ్రత్ కౌర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా సైతం చేశారు. పలు వ్యవసాయ సంఘాలు రైల్ రోకోకు, బంద్‌కు పిలుపునిచ్చాయి. రేపు ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం.
కరోనావైరస్ (Coronavirus) కారణంగా మరో ఎంపీ కన్నుమూశారు. కొన్నిరోజుల క్రితం ఈ వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్న బీజేపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అశోక్ గస్తీ (55) గురువారం రాత్రి ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.
దేశవ్యాప్తంగా కరోనావైరస్ (Coronavirus) కేసుల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో పలువరు ఎంపీలు.. కరోనా నియంత్రణలో మహారాష్ర్ట ప్రభుత్వం విఫలమయ్యిందని.. విమర్శలు చేశారు. దీంతో ఆ వ్యాఖ్యలను శివసేన నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ తిప్పికొడుతూ గురువారం రాజ్యసభలో పలు ప్రశ్నలను సంధించారు.
శంలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి నానాటికీ పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడిన నేపథ్యంలో.. ఎంపీలందరూ సమావేశాలకు 72గంటల ముందు కరోనా పరీక్షలు చేయించుకోవాలని, రిపోర్టు నెగిటీవ్ వచ్చిన వారికే లోపలికి అనుమతి ఉంటుందని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సర్క్యూలర్‌ను సైతం జారీ చేశారు.
పార్లమెంట్ చరిత్రలో ప్రస్తుత వర్షకాల సమావేశాలు చరిత్రలో నిలిచిపోనున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే పార్లమెంట్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సెప్టెంబరు 14 నుంచి అక్టోబరు 1 వరకు జరగనున్న పార్లమెంట్ సమావేశాలకు.. సభ్యులందరూ 3రోజుల ముందుగానే కరోనా పరీక్షలు చేయించుకోవాలని.. దీంతోపాటు ఈ సెషన్‌కు సెలవులను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ( YSR Congress Party ) నుంచి రాజ్యసభ ( Rajya Sabha ) కు నూతనంగా ఎన్నికైన పరిమళ్ నత్వానీ ప్రమాణస్వీకారం చేశారు. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయన ఛాంబర్లో పరిమళ్ నత్వానీతో బుధవారం ప్రమాణ స్వీకారం చేయించారు.
భారత్‌లో కరోనావైరస్ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 14 నుంచి అక్టోబరు 1 వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. అయితే కరోనావైరస్ కారణంగా ఈ సారి సమావేశాల కోసం ప్రత్యేక ఏర్పాట్లతోపాటు.. సభ్యులకు పలు షరతులు కూడా విధిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు ఉభయసభల అధికారులు.
దేశవ్యాప్తంగా కరోనా ( Coronavirus) వినాశనం కొనసాగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిదులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు కరోనా బారిన పడ్డారు. తాజాగా తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ కరోనా బారిన పడి కన్నుమూశారు.
సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ .. రాజ్యసభ సభ్యుడుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్యసభలో జరిగిన ఈ కార్యక్రమం గందరగోళం మధ్య సాగింది.
కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాను పెద్దల సభకు పంపనున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్‌ల నుంచి రాజ్యసభకు నామినేట్ చేసేందుకు పార్టీ వర్గాల్లో చర్చ మొదలయ్యింది.
దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం -2019పై వ్యతిరేక ఆందోళనలు చెలరేగుతున్నాయి. CAA-2019, NRCని వ్యతిరేకిస్తూ వేలాది మంది రోడ్లపైకి వస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో రోజూ నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ రోజూ ఇవే ఆందోళనలతో అట్టుడుకుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.