Parliament: ఎంపీల్లో టెన్షన్.. పలువురు సభ్యులకు కరోనా..?

శంలో కరోనావైరస్‌ (Coronavirus) వ్యాప్తి నానాటికీ పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడిన నేపథ్యంలో.. ఎంపీలందరూ సమావేశాలకు 72గంటల ముందు కరోనా పరీక్షలు చేయించుకోవాలని, రిపోర్టు నెగిటీవ్ వచ్చిన వారికే లోపలికి అనుమతి ఉంటుందని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సర్క్యూలర్‌ను సైతం జారీ చేశారు.

Last Updated : Sep 13, 2020, 05:15 PM IST
Parliament: ఎంపీల్లో టెన్షన్.. పలువురు సభ్యులకు కరోనా..?

Parliament monsoon session: న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్‌ (Coronavirus) వ్యాప్తి నానాటికీ పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడిన నేపథ్యంలో.. ఎంపీలందరూ సమావేశాలకు 72గంటల ముందు కరోనా పరీక్షలు చేయించుకోవాలని, రిపోర్టు నెగిటీవ్ వచ్చిన వారికే లోపలికి అనుమతి ఉంటుందని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సర్క్యూలర్‌ను సైతం జారీ చేశారు. అంతేకాకుండా ఎలాంటి సెలవులు లేకుండా సెప్టెంబరు 14నుంచి అక్టోబరు 1వరకు ఉభయసభలు వేర్వేరుగా ఉదయం, సాయంత్రం జరుగుతాయని, ఈ సమావేశంలో క్వశ్చన్ అవర్ కూడా ఉండదని అధికారులు పేర్కొన్నారు. అంతేకాకుండా సీటింగ్ వ్యవస్థను కూడా మార్చడంతోపాటు.. ఎల్‌సీడీలను ఏర్పాటుచేశారు. ఈ క్రమంలోనే తాజాగా అఖిలపక్ష సమావేశాన్ని కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. Also read: Parliament: చరిత్రలో నిలిచిపోనున్న పార్లమెంట్ సమావేశాలు

అయితే.. పార్లమెంట్ సమావేశాలకు ముందు కరోనా పరీక్షలు చేయించుకున్న ఐదుగురు సభ్యులకు పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు తెలిసింది. అంతేకాకుండా ఇంకా మరికొంతమంది రిపోర్టులు కూడా రావాల్సి ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఏదిఏమైనప్పటికీ సమావేశాలకు ముందు కరోనా పరీక్షలు చేస్తుండటంతో ఎంపీలందరిలో టెన్షన్ నెలకొంది. సమావేశాల మధ్యలో ఎవరికైనా సభ్యులకు కానీ.. అధికారులకు కానీ వైరస్‌ సోకితే వ్యాప్తి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని పలువురు ఆందోళన చెందుతున్నారు. Also read: Parliament session: ప్ర‌శ్నోత్త‌రాలు లేకుండానే పార్ల‌మెంట్‌

Trending News