ఎంపీగా జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రమాణ స్వీకారం

సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ .. రాజ్యసభ సభ్యుడుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్యసభలో జరిగిన ఈ కార్యక్రమం గందరగోళం మధ్య సాగింది. 

Last Updated : Mar 19, 2020, 12:24 PM IST
ఎంపీగా జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రమాణ స్వీకారం

సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ .. రాజ్యసభ సభ్యుడుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్యసభలో జరిగిన ఈ కార్యక్రమం గందరగోళం మధ్య సాగింది.  

Read Also: సీఆర్పీఎఫ్ ఎస్ఐ ఆత్మహత్య

సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్  రంజన్ గొగోయ్ కు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఐతే ఈ క్రమంలో ఆయన ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి రాజ్యసభలో గందరగోళానికి దారి తీసింది. ఐతే విపక్ష ఎంపీల గందరగోళం మధ్యే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. జస్టిస్ రంజన్ గొగోయ్ తో రాజ్యసభ ఛైర్మన్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు. ఐతే ఆయన ప్రమాణ స్వీకారం చేస్తుండగానే విపక్ష సభ్యులు సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. బయటకు వెళ్లిపోయారు. 

Read Also: మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం

మరోవైపు సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ కి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్ధించుకుంది. ఇప్పటి వరకు సమాజంలో గొప్ప హోదాల్లో పని చేసిన ఎందరికో రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టిన చరిత్ర ఉందని కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ అన్నారు. .జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.

Trending News