పార్లమెంట్ శీతాకాల సమావేశాల తేదీలు ఖరారు

పార్లమెంట్ శీతాకాల సమావేశాల తేదీలు ఖరారు

Last Updated : Oct 21, 2019, 05:40 PM IST
పార్లమెంట్ శీతాకాల సమావేశాల తేదీలు ఖరారు

న్యూఢిల్లీ: నవంబర్ 18వ తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నవంబర్ 18 నుంచి డిసెంబర్ 13 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాజ్యసభ, లోక్ సభ సెక్రటేరియట్‌లకు తెలిపింది. ఈ శీతాకాల సమావేశాల్లో పలురకాల బిల్లులతో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రెండు ఆర్డినెన్సులకు ఆమోదం పొందేలా చేయాలని కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆ రెండు ఆర్డినెన్సులలో ఒకటి నూతన, దేశీయ తయారీ కంపెనీలకు కార్పొరేట్ పన్ను తగ్గించడం అయితే, ఈ-సిగరెట్ల నిషేధం రెండోది. 

నూతన, దేశీయ తయారీ కంపెనీలకు కార్పొరేట్ పన్ను తగ్గించడం వల్ల ఆర్ధిక మందగమనాన్ని అడ్డుకోవడంతో పాటు అభివృద్ధికి తోడ్పాటును అందించవచ్చని కేంద్రం భావిస్తోంది. ఫైనాన్స్ చట్టం 2019, ఆదాయ పన్ను చట్టం 1961కి సవరణలు చేస్తూ సెప్టెంబర్‌లో ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఇక సెప్టెంబర్‌లోనే తీసుకొచ్చిన మరో ఆర్డినెన్స్ ఈ సిగరెట్ల నిషేధం. ఈ సిగరెట్లు తరహా ఉత్పత్తుల తయారీ, అమ్మకం, నిల్వ చేయడాన్ని పూర్తిగా నిషేధం విధించడం ఈ ఆర్డినెన్స్ లక్ష్యం. 

గత రెండేళ్లుగా జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల సరళిని పరిశీలిస్తే.. నవంబర్ 21న ప్రారంభమవుతున్న సమావేశాలు, జనవరి మొదటి వారంలో ముగుస్తున్నాయి.

Trending News