AP: రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేసిన పరిమళ్ నత్వానీ

ఆంధ్రప్రదేశ్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ( YSR Congress Party ) నుంచి రాజ్యసభ ( Rajya Sabha ) కు నూతనంగా ఎన్నికైన పరిమళ్ నత్వానీ ప్రమాణస్వీకారం చేశారు. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయన ఛాంబర్‌లో పరిమళ్ నత్వానీతో బుధవారం ప్రమాణ స్వీకారం చేయించారు.

Last Updated : Sep 9, 2020, 05:59 PM IST
AP: రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేసిన పరిమళ్ నత్వానీ

Rajya Sabha member Parimal Nathwani takes oath: ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ( YSR Congress Party ) నుంచి రాజ్యసభ ( Rajya Sabha ) కు నూతనంగా ఎన్నికైన పరిమళ్ నత్వానీ ప్రమాణస్వీకారం చేశారు. ఈమేరకు రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయన ఛాంబర్‌లో పరిమళ్ నత్వానీతో బుధవారం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ విషయాన్ని నత్వానీ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. రాజ్యసభ సభ్యుడిగా గౌరవ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడం గౌరవంగా ఉంది..  నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు. నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేసేందుకు ఎదురు చూస్తున్నానంటూ ఆయన ట్విట్ చేశారు. Also read: Akhil Akkineni: సురేందర్‌ రెడ్డి డైరెక్షన్‌లో అఖిల్ ఐదో సినిమా

ఇదిలాఉంటే.. జూలై 22న నూతనంగా రాజ్యసభకు ఎన్నికైన సభ్యులంతా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజున నత్వానీ మినహా.. ఏపీ నుంచి ఎన్నికైన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకట రమణారావు సభ్యులుగా ప్రమాణం చేశారు. అయితే పరిమళ్ నత్వానీ మాత్రం వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేకపోయారు. Also read: Parliament Session: పార్టీ రాజ్యసభ సభ్యులకు బీజేపీ విప్

Trending News