త్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్‌కు కేంద్రం ఆమోదం

భారత ప్రధాన మంత్రి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం త్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ ను ఆమోదించింది.

Last Updated : Sep 19, 2018, 01:09 PM IST
త్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్‌కు కేంద్రం ఆమోదం

భారత ప్రధాన మంత్రి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం త్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ ను ఆమోదించింది. ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌తో త్రిపుల్‌ తలాక్‌ను కేంద్రం చట్టంగా మార్చింది. పార్లమెంట్‌ సమావేశాలు లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ ద్వారా చట్టం చేసింది. ముస్లిం మహిళలకు త్రిపుల్ తలాక్‌ విధానంలో విడాకులు ఇస్తే ఇకపై నేరంగా పరిగణించబడుతుంది. త్రిపుల్ తలాక్‌ చెప్పిన భర్తపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

తక్షణ తలాక్ విడాకుల విధానానికి వ్యతిరేకంగా కేంద్రం బిల్లును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనికి లోక్‌సభలో ఆమోద ముద్ర పడినా రాజ్యసభలో బ్రేక్ పడింది. తలాక్‌ బిల్లులో సవరణలు చేయాల్సిందిగా పలు పార్టీలు సూచించగా.. కేంద్రం సవరణలు చేసేందుకు ఒప్పుకుంది.

ఈ సవరణ చేసిన తక్షణ తలాక్‌ బిల్లు ప్రకారం.. తలాక్‌ చెప్పిన భర్తలపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేస్తారు. కానీ, అతడు కోర్టును ఆశ్రయించి బెయిల్‌ తీసుకోవచ్చు. బాధితురాలు తన మైనర్‌ పిల్లల సంరక్షణ బాధ్యతలు అప్పగించమని కోర్టును అడగవచ్చు. అయితే.. తలాక్‌ చెప్పడం నేరమని, అలా చెప్పిన భర్తకు మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని గతంలో ఈ బిల్లులో పేర్కొన్నారు.

2017ఆగస్టులో సుప్రీంకోర్టు త్రిపుల్ తలాక్ భారత రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పింది.

 

Trending News