రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం బ్యాడ్ న్యూస్!

రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం బ్యాడ్ న్యూస్!

Last Updated : Dec 20, 2018, 07:58 PM IST
రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం బ్యాడ్ న్యూస్!

న్యూఢిల్లీ: రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు షాక్ ఇస్తూ కేంద్రం ఓ బ్యాడ్ న్యూస్ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఆ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కోరుకుంటున్న నియోజకవర్గాల సంఖ్య పెంపు 2026 వరకు అసాధ్యం అని కేంద్రం మరోసారి తేల్చిచెప్పింది. ఏపీ రాష్ట్ర విభజన బిల్లులో నియోజకవర్గాల సంఖ్య పెంపు అంశం ఉన్నప్పటికీ.. సాంకేతికంగా 2026 వరకు అది సాధ్యపడదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం అహిర్ బుధవారం రాజ్యసభకు తెలిపారు. టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొన్న ఓ కథనం ప్రకారం.. టీడీపీ ఎంపీ వై సుజనా చౌదరి అడిగిన ప్రశ్నకు బదులిచ్చే క్రమంలో హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం అహిర్ సభలో ఈ అంశాన్ని వెల్లడించినట్టు సమాచారం.

రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు అంశాన్ని ఏపీ రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 26లో ప్రస్తావించినప్పటికీ.. 2026 వరకు అది కుదిరేపనికాదు అని ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి బదులిచ్చారని ఆ కథనం పేర్కొంది.

Trending News