Parliament Session in Rajya Sabha | ఓ వైపు కేంద్ర మంత్రులతో పాటు 30 మంది ఎంపీలు కరోనా పడ్డారు. మరోవైపు సభలో ప్రవేశపెడుతున్న వ్యవసాయ సంబంధిత బిల్లులతో పాటు ఇతర బిల్లులపై చర్చ గందరగోళ పరిస్థితులకు దారితీస్తోంది.
కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటివరకూ కంపెనీలకే పరిమితమైన జీతాల కోత ఇప్పుడు పార్లమెంట్ కు సైతం వర్తించింది. ఎంపీల జీతాల్లో 30 శాతం కోత విధించే బిల్లును లోక్ సభ ఆమోదించింది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ( Parliament monsoon session ) నేపథ్యంలో లోకసభ, రాజ్యసభ సభ్యులందరికీ కరోనా పరీక్షలు చేసిన విషయం తెలిసిందే. ఈ పరీక్షల్లో దాదాపు 20 మందికిపైగా ఎంపీలకు కరోనా (Coronavirus) పాజిటివ్‌గా నిర్థారణ అయింది.
పార్లమెంట్ చరిత్రలో ప్రస్తుత వర్షకాల సమావేశాలు చరిత్రలో నిలిచిపోనున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే పార్లమెంట్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సెప్టెంబరు 14 నుంచి అక్టోబరు 1 వరకు జరగనున్న పార్లమెంట్ సమావేశాలకు.. సభ్యులందరూ 3రోజుల ముందుగానే కరోనా పరీక్షలు చేయించుకోవాలని.. దీంతోపాటు ఈ సెషన్‌కు సెలవులను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
కోవిడ్ 19 నిబంధనల ( Covid19 regulations ) మధ్య పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ( Parliament rainy sessions ) ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1 వరకూ ఈ సమావేశాలు జరగనున్నట్టు అదికారులు వెల్లడించారు.
రేవంత్ రెడ్డి అరెస్ట్ వ్యవహారం (Revanth Reddy`s arrest) పార్లమెంట్‌కు చేరింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తిచూపుతున్న కాంగ్రెస్ నేతలను తెలంగాణ సర్కార్ (Telangana govt) తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని.. అందులో భాగంగానే రాజకీయంగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై పైచేయి సాధించడానికే ఆయన్ను అక్రమ అరెస్ట్ చేశారని కాంగ్రెస్ ఎంపీలు లోక్ సభ స్పీకర్‌కి ఫిర్యాదు చేశారు.
విభజన హామీలు నెరవేర్చడంలో మోడీ సర్కార్ విఫలమైందనే ఆరోపణలు చేస్తూ వచ్చిన టీడీపీ..మరోమారు లోక్ సభలో కేంద్రంపై అవిశ్వాసతీర్మానం ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం లోక్ సభ సెక్రటరీ జనరల్ కు టీడీపీ ఎంపీ కేశినేని అవిశ్వాసం నోటీసులు ఇచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.