త్రిపుల్ తలాక్ బిల్లు 2019: ప్రతిపక్షాల నిరసనల మధ్యే లోక్ సభలోకి బిల్లు

ప్రధాని నరేంద్ర మోదీ రెండోసారి కేంద్రంలో అధికారంలోకొచ్చిన అనంతరం తాజాగా మరోసారి ఇవాళ ఎన్డీఏ సర్కార్ త్రిపుల్ తలాక్ బిల్లుని లోక్ సభలో ప్రతిపాదించింది.

Last Updated : Jun 21, 2019, 04:55 PM IST
త్రిపుల్ తలాక్ బిల్లు 2019: ప్రతిపక్షాల నిరసనల మధ్యే లోక్ సభలోకి బిల్లు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రెండోసారి కేంద్రంలో అధికారంలోకొచ్చిన అనంతరం తాజాగా మరోసారి ఇవాళ ఎన్డీఏ సర్కార్ త్రిపుల్ తలాక్ బిల్లుని లోక్ సభలో ప్రతిపాదించింది. నరేంద్ర మోదీ సర్కార్ రెండోసారి అధికారంలోకొచ్చిన అనంతరం పార్లమెంట్‌లో టేబుల్‌పైకి వచ్చిన తొలి బిల్లు ఇదే. ముస్లిం మహిళలకు న్యాయం చేయడానికే ఈ బిల్లుని ప్రతిపాదిస్తున్నట్టుగా కేంద్రం చెబుతోంటే, మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం ది ముస్లిం ఉమెన్ బిల్ 2019తో ముస్లిం మహిళలకు అన్యాయమే జరుగుతుందని.. అంతేకాకుండా ఈ బిల్లు రాజ్యాంగ విరుద్దమే అవుతుందని ఆరోపిస్తున్నాయి. 

లోక్ సభలో త్రిపుల్ తలాక్ బిల్లును ప్రతిపాదించిన సందర్భంగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. దేశంలో 543 త్రిపుల్ తలాక్ కేసులు వెలుగుచూసినట్టు గుర్తుచేశారు. అంతేకాకుండా సుప్రీం కోర్టు త్రిపుల్ తలాక్‌ పద్ధతిని నిషేధించిన తర్వాత కూడా దేశంలో సుమారు 200 వరకు త్రిపుల్ తలాక్ ఘటనలు చోటుచేసుకున్నట్టు మంత్రి రవి శంకర్ ప్రసాద్ సభకు తెలిపారు.

Trending News